Share News

Baldness: పురుషులకే బట్టతల ఎక్కువగా రావడానికి సైంటిఫిక్ రీజన్స్ ఇవే..

ABN , Publish Date - May 30 , 2025 | 11:37 AM

Baldness In Men Reasons: నేటి జీవనశైలి, ఒత్తిడితో కూడిన దినచర్యల కారణంగా జుట్టు రాలే సమస్య వేగంగా పెరుగుతోంది. అయితే, సాధారణంగా స్త్రీలతో పోలిస్తే చిన్నవయసులోనే పురుషుల్లో బట్టతల కనిపిస్తోంది. మరి ఈ సమస్య వెనుక ఉన్న కారణమేంమిటి? పురుషుల్లోనే ఎందుకు ఎక్కువగా కనిపిస్తుంది? ఎలా నివారించాలి?

Baldness: పురుషులకే బట్టతల ఎక్కువగా రావడానికి సైంటిఫిక్ రీజన్స్ ఇవే..
Baldness in Men vs Women Reasons

Baldness in Men vs Women: ఇటీవలి కాలంలో జుట్టు రాలే సమస్యతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అలాగే బట్టతల సమస్య కూడా కనిపిస్తోంది. ఇందుకు అనేక రకాల కారణాలు ఉన్నాయి. అయితే, మారుతున్న ప్రజల జీవనశైలి, ఒత్తిడితో కూడిన దినచర్యలు ఈ సమస్యకు ప్రధాన కారణంగా పరిగణించవచ్చు. జుట్టు రాలే సమస్య పురుషులు, స్త్రీలు ఇద్దరిలోనూ కనిపిస్తున్నప్పటికీ పురుషుల్లోనే ఎక్కువగా బట్టతల కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఇది వ్యక్తి అందాన్ని మాత్రమే కాదు. ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇంతకీ, బట్టతల రావడానికి కారణమేమిటి? ఈ రకమైన సమస్య పురుషులలో ఎందుకు ఎక్కువగా కనిపిస్తుంది? ఎలా నివారించాలో తెలుసుకోండి.


బట్టతల రావడానికి కారణం ఏమిటి?

సాధారణంగా మన జుట్టు మూలాలు బలహీనంగా మారినప్పుడు జుట్టు క్రమంగా రాలిపోవడం ప్రారంభమవుతుంది. చాలాకాలం పాటు ఇదే సమస్య ఉంటే బట్టతల సమస్య వచ్చేందుకు కారణమవుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, డైహైడ్రోటెస్టోస్టెరాన్ (DHT) అనే హార్మోన్ జుట్టు మూలాలను దెబ్బతీస్తుంది. దీనివల్ల జుట్టు కుదుళ్ల బలహీనంగా మారి రాలిపోవడం మొదలవుతుంది. ఇదే కాకుండా తరచూ ఒత్తిడికి గురువుతున్నా.. అలాంటి వాతావరణంలో పనిచేస్తున్నా జుట్టు అధికంగా రాలుతుంది. శరీరంలో హార్మోన్ల అసమతుల్యత కూడా జుట్టు పెరుగుదలను ప్రభావితం చేస్తుంది. అదనంగా, విటమిన్లు బి, డి, ఐరన్, జింక్, తగినంత ప్రోటీన్ శరీరానికి అందకపోయినా జుట్టు బలహీనపడుతుంది. హెయిర్ కలర్స్, స్టైల్స్, స్ట్రెయిటెనింగ్ చేయించడం వంటి పద్ధతులు కూడా జుట్టును దెబ్బతీస్తాయి. ఇవన్నీ కాకుండా థైరాయిడ్ సమస్యలు, డయాబెటిస్, క్యాన్సర్ లేదా కొన్ని రకాల మందులు తీసుకోవడం, జన్యుపరమైన అంశాలు జుట్టు రాలడానికి కారణమవుతాయి.


పురుషుల్లోనే బట్టతల ఎందుకు ఎక్కువ?

పురుషులలో టెస్టోస్టెరాన్ ఉత్పత్తి చేసే DHT హార్మోన్ జుట్టు మూలాలను త్వరగా దెబ్బతీస్తుంది. స్త్రీలలో ఈ హార్మోన్ స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల వారి జుట్టు అంత త్వరగా రాలదు. ఇదేగాక పురుషులలో బట్టతల సాధారణంగా నుదిటి నుంచి ప్రారంభమై తల మధ్యభాగానికి వెళుతుంది, అయితే స్త్రీలలో తల మొత్తంపై సమాంతరంగా జుట్టు రాలుతూ ఉంటుంది. అందుకే స్త్రీలలో అంత త్వరగా జుట్టు రాలినట్టు అనిపించదు. ఎన్ని సమస్యలున్నప్పటికీ ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ మహిళల్లో జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. డైహైడ్రోటెస్టోస్టెరాన్ ప్రభావం వల్లే పురుషుల్లో బట్టతల సమస్య అధికం. ఈ సమస్య సాధారణంగా 20 ఏళ్లు దాటిన పురుషులలోనే కనిపిస్తుంది.


ఎలా నివారించాలి?

ప్రోటీన్, ఐరన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు బి12, డి అధికంగా ఉండే ఆహారాన్ని రోజూవారీ ఆహారంలో భాగం చేసుకుని తినండి. ధ్యానం, యోగా, నిద్ర క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఒకే సమయంలో చేయండి. ఒత్తిడిని తగ్గిపోతుంది. హెయిర్ డై, జెల్, స్ప్రే వాడటం మానుకుంటే మంచిది. జుట్టు రాలే మరీ ఎక్కువగా ఉంటే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించండి.


Also Read:

భార్యని మనస్ఫూర్తిగా ప్రేమించే భర్త అలవాట్లు ఇవే..

ఉదయాన్నే చిరాగ్గా అనిపిస్తోందా.. ఇలా జరగడానికి కారణాలివే..

For More Lifestyle And Telugu News

Updated Date - May 30 , 2025 | 11:59 AM