Share News

Eye Health: గీతలు పడిన కళ్లద్దాలు వాడుతున్నారా.. ఈ 5 తీవ్ర సమస్యలు తప్పవు..

ABN , Publish Date - May 10 , 2025 | 04:58 PM

Eye Health Tips: కంటి చూపు తగ్గి కొందరు, స్మార్ట్ లుక్స్ కోసం మరికొందరు రోజూ కళ్లద్దాలు ధరిస్తుంటారు. అయితే, మీరెప్పుడైనా మీ కళ్లద్దాలపై చిన్న చిన్న గీతలు ఉన్నాయేమో అని చెక్ చేశారా.. లేకపోతే ఉన్నా చూసి చూడనట్టు వదిలేస్తున్నారా.. ఈ చిన్నపాటి నిర్లక్ష్యం ఎన్ని ప్రమాదాలు తెచ్చిపెడుతుందో తెలుసా..

Eye Health: గీతలు పడిన కళ్లద్దాలు వాడుతున్నారా.. ఈ 5 తీవ్ర సమస్యలు తప్పవు..
Scratched Glasses Side Effects

Scratched Glasses Side Effects: నేటి కాలంలో రోజులో దాదాపు 8 పైనే కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ పై వర్క్ చేసేవాళ్లే ఎక్కువ. కళ్లు దెబ్బతినకుండా ఉండాలని కొందరు, స్టైలిష్ లుక్ కోసం మరికొందరు గాగుల్స్ వాడటం మామూలే విషయమే. కానీ, కళ్లద్దాలు ధరించే ముందు ఎప్పుడైనా లెన్స్‌పై చిన్న చిన్న గీతలు ఉండటం చూశారా. తెలిసీ తెలియక ఇలాంటి గీతలున్న కళ్లద్దాలు వాడే అలవాటుంటే వెంటనే మానేయండి. ఇలా చేయకపోయారంటే మాత్రం మీకు తెలియకుండానే కళ్లపై ఈ దుష్ప్రభావాలు పడటం ఖాయం. స్క్రాచెస్ ఉన్న స్పెట్స్ వాడితే కళ్లకు ఎలాంటి నష్టం వాటిల్లుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.


కంటిపై ఒత్తిడి

గీతలు పడిన అద్దాలు ధరించడం వల్ల మీ దృష్టి మసకబారుతుంది. దీని వలన ఏదైనా చూడటానికి మీ కళ్ళు మరింత కష్టపడాల్సి వస్తుంది. ఫలితంగా కంటికి అలసట, ఒత్తిడి, తలనొప్పి రావచ్చు.


కంటి వ్యాధులు

గ్లాసెస్ లెన్స్‌లు తరచుగా యాంటీ-రిఫ్లెక్టివ్ బ్లూ లైట్ ఫిల్టర్ లేదా UV ప్రొటెక్షన్ కోటింగ్‌ను కలిగి ఉంటాయి. కానీ లెన్స్ గీతలు పడినప్పుడు ఈ పూత నెమ్మదిగా క్షీణించడం ప్రారంభమవుతుంది. ఇది కంటి రక్షణను ప్రభావితం చేస్తుంది. సూర్యుని హానికరమైన కిరణాల నుంచి కళ్లను రక్షించుకోలేము. దీర్ఘకాలంలో ఆ వ్యక్తికి కంటిశుక్లం లేదా కంటి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.


కళ్ళలో మంట, పొడిబారడం

చిన్న చిన్న గీతలు పడిన లెన్స్‌లు ఉన్న కళ్లజోడు ధరించడం వల్ల మీ కళ్ళు మరింత ఒత్తిడికి గురవుతాయి. దీనివల్ల కనురెప్పలు కొట్టుకోవడం తగ్గుతుంది. తద్వారా కళ్ళు పొడిబారడం లేదా చికాకు వంటి సమస్యలు వస్తాయి.


ఇన్ఫెక్షన్

గ్లాస్ లెన్స్‌లపై లోతైన గీతలు ఉంటే వాటిలో దుమ్మూ ధూళి లేదా బ్యాక్టీరియా పేరుకుపోయి కంటి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.


మానసిక ఒత్తిడి

కళ్ళజోడు లెన్స్‌పై ఒక గీత ఉన్నా వాటిని పెట్టుకున్నప్పుడు స్పష్టంగా చూడలేం. దీని కారణంగా వ్యక్తికి అసౌకర్యం కలుగుతుంది. ఏకాగ్రత తగ్గి ఇబ్బంది పడతారు. ఇది సాధారణంగా మానసిక ఒత్తిడిని పెంచి చిరాకును కలిగిస్తుంది.


Read Also: Summer Tips: ఏసీ వాడేటప్పుడు ఫ్యాన్ ఆన్‌లో ఉంచడం సరైందేనా..

Cooking Tips: ఈ కూరల్లో ఉల్లిపాయ మిక్స్ చేస్తే.. రుచి, ఆరోగ్యం రెండూ చెడిపోతాయి..

Mosquito Repellents: ఇంట్లో దోమల బెడద తట్టుకోలేకపోతున్నారా.. ఈ

Updated Date - May 10 , 2025 | 05:25 PM