Share News

Barefoot Walking: ఉదయం గడ్డి మీద చెప్పులు లేకుండా నడిస్తే కలిగే 5 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..

ABN , Publish Date - Jun 16 , 2025 | 01:43 PM

Barefoot Walking Benefits: ఉదయపు నడక ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే. అయితే, ప్రకృతితో మమేకమై ఇలా నడిచారంటే మాత్రం మీరు ఊహించని విధంగా ఈ 5 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అవేంటంటే..

Barefoot Walking: ఉదయం గడ్డి మీద చెప్పులు లేకుండా నడిస్తే కలిగే 5 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..
Barefoot Walking Benefits On Grass In The Morning

Barefoot Walking Benefits On Grass: సూర్యుడు తెలతెలవారే సమయంలో ధ్యానం, వ్యాయామం, నడక ఇలా ఏ శారీరక కార్యకలాపం చేసినా అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి. కాకపోతే అందరూ ఈ దినచర్య పాటించలేరు. కానీ, ఈ స్పీడ్ యుగంలోనూ మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎన్నో సహజ మార్గాలు ఇంకా ఉన్నాయి. అత్యంత సాధారణంగా కనిపించే ఈ శక్తిమంతమైన అలవాటుతో మీ ఆరోగ్యానికి ఢోకా ఉండదు.


ఉదయాన్నే మట్టిపైన నడవడాన్ని గౌండింగ్ లేదా అర్థింగ్ అని అంటారు. ఈ తరహా అలవాటును రోజూ ఆచరణలో పెడితే శరీరానికి ఎన్నో లాభాలు. ఈ సులభమైన అలవాటు ద్వారా మన శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరడమే కాదు. ఒత్తిడి సమస్యలు తొలగిపోయి చురుగ్గా ఉంటారు.


1. ఒత్తిడి, ఆందోళన

ఉదయం గడ్డి మీద నడవడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. తాజా గాలి, చల్లని గడ్డి, ప్రకృతిలో నడిస్తే సహజంగానే ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ హార్మోన్ స్థాయి శరీరంలో తగ్గిపోతుంది. కేవలం 10–15 నిమిషాలు చెప్పులు లేకుండా నడవడం వల్ల మీ ఒత్తిడి దూదిపింజలా ఎగిరిపోయి ప్రశాంతత లభిస్తుంది. మానసిక స్థితి మెరుగుపడి రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు.


2. నిద్ర నాణ్యత

మీరు చెప్పులు లేకుండ పాదాలతో భూమిని తాకడం వల్ల మీ శరీర అంతర్గత గడియారం కంట్రోల్ అవుతుంది. నేల మీద కూర్చోవడం వల్ల మెలటోనిన్ ఉత్పత్తి మెరుగుపడి మంచి నిద్రకు దారితీస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అంటే, ఉదయపు నడక మీ రోజుకు ఆరోగ్యకరమైన లయను సెట్ చేయడంతో పాటు రాత్రుళ్లు గాఢంగా, ప్రశాంతమైన నిద్రపోయేలా సహకరిస్తుంది.


3. రోగనిరోధక శక్తి

చెప్పులు లేకుండా నడవడం వల్ల మీ శరీరం భూమి నుండి ఎలక్ట్రాన్‌లను గ్రహించడానికి వీలు కల్పిస్తుంది. ఇది వాపుతో పోరాడటానికి, మీ రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇవ్వడానికి సహాయపడుతుంది. ఉదయాన్నే సూర్యకాంతిలో నడుస్తారు కాబట్టి మీ శరీరానికి విటమిన్ డి కూడా పుష్కలంగా అందుతుంది.


4. పాదాలు, కండరాలు

బూట్లు తరచుగా సహజ కదలికను పరిమితం చేస్తాయి. చెప్పులు లేకుండా నడవడం వల్ల మీ పాదాలు, చీలమండలలోని చిన్న కండరాలు బలపడతాయి. కాలక్రమేణా ఈ అలవాటు మొత్తం పాదాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.


5. రక్త ప్రసరణ

ముఖ్యంగా ఆకుపచ్చటి గడ్డి ఉన్న చోట నడవడం వల్ల మీ పాదాలలో నరాల చివరలు ఉత్తేజితమవుతాయి. శరీరం అంతటా రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. మెరుగైన ప్రసరణ ఉంటే మీ అవయవాలకు ఆక్సిజన్ డెలివరీ సక్రమంగా జరగుతుంది. తద్వారా సహజంగా శక్తి పెరుగుతుంది.


ఇవి కూడా చదవండి:

వానాకాలంలో ఇంట్లోకి పాములు రాకుండా ఉండాలంటే..

అర్ధరాత్రి వేళ విమాన టిక్కెట్లు బుక్ చేస్తే తక్కువ ధర..

మరిన్ని లైఫ్ స్టైల్ కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 16 , 2025 | 03:07 PM