IRCTC: అదిరిపోయే ప్యాకేజీ.. రూ. 14 వేలకే కేరళ టూర్..
ABN , Publish Date - Jun 18 , 2025 | 01:36 PM
కేరళ అంటేనే ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్. అలాంటి కేరళ వేళ్లేందుకు యాత్రికుకు ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది.

కేరళ అంటేనే ప్రకృతి సౌందర్యానికి కేరాఫ్ అడ్రాస్. ఈ రాష్ట్రంలోని ప్రకృతి అందాలను ఆస్వాదించాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక సూపర్ ఆఫర్‌ను ప్రకటించింది. కేరళ హిల్స్ అండ్ వాటర్స్ (Kerala Hills & Waters) పేరుతో ఈ ప్రత్యేక ప్యాకేజీని తీసుకు వచ్చింది. ఈ ప్యాకేజీ కింద కేవలం రూ. 14 వేలుతో అలెప్పీ బ్యాక్ వాటర్స్, మున్నార్ హిల్స్ అందాలను సైతం వీక్షించవచ్చు. ఈ టూర్‌లో మొత్తం ఐదు రాత్రులు, ఆరు పగళ్లు ఉంటాయి. జూ్ 17 నుంచి సెప్టెంబర్ 23వ తేదీ వరకు ఈ ప్యాకేజీ టికెట్లు అందుబాటులో ఉన్నాయి.
కేరళ యాత్ర వివరాలు..
మొదటి రోజు.. ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ నుంచి శబరి ఎక్స్‌ప్రెస్ (రైలు నెంబర్: 17230) బయలుదేతుంది. నల్గొండ, గుంటూరు, తెనాలి స్టేషన్లలో ఆ రైలు ఆగుతోంది. రాత్రంతా రైలు ప్రయాణం ఉంటుంది.
రెండో రోజు: మధ్యాహ్నం 12.55 గంటలకు ఎర్నాకులం స్టేషన్‌కు రైలు చేరుకుంటుంది. అక్కడి ఐఆర్‌సీటీసీ సిబ్బంది ఈ రైలులో వచ్చిన యాత్రికులకు మున్నార్‌కు తీసుకు వెళ్తారు. అక్కడ ముందుగానే బుక్ చేసిన హోటల్‌లో ఆ రోజు రాత్రికి బస ఏర్పాటు చేస్తారు.
మూడో రోజు: ఉదయం ఎరావికులం నేషనల్ పార్క్, టీ మ్యూజియం, మెట్టుపట్టి డ్యామ్, ఎకో పాయింట్ ప్రదేశాలకు తీసుకు వెళ్తారు. అనంతరం మున్నార్‌లోనే ఉంటారు.
నాలుగో రోజు: అలెప్పీకి చేరుకుంటారు. రోజంతా అలెప్పీ పరిసరాల్లోని అందమైన ప్రదేశాలకు తీసుకు వెళ్తారు. ఆ రాత్రి అలెప్పీలోన బస ఏర్పాటు చేస్తారు. బ్యాక్ వాటర్స్ అందాలు ప్రతి ఒక్కరి మనస్సును కట్టి పడేస్తాయి.
ఐదో రోజు: అలెప్పీ నుంచి ఎర్నాకులం రైల్వే స్టేషన్‌కు తిరిగి వస్తారు. అక్కడ మధ్యాహ్నం 11.20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ (రైలు నెంబర్ 17229) బయలుదేరుతోంది.
ఆరో రోజు: మధ్యాహ్నం 12.20 గంటలకు ఈ రైలు సికింద్రాబాద్ చేరుకోవడంతో కేరళ యాత్ర పూర్తవుతుంది.
ప్యాకేజీ ఛార్జీలు ఇలా ఉన్నాయి..
ఈ ప్యాకేజీలో రెండు రకాల వసతులున్నాయి: కంఫర్ట్ (3rd ఏసీ బెర్త్), స్టాండర్డ్ (స్లీపర్ బెర్త్) ఉన్నాయి. మీ సౌలభ్యాన్ని బట్టి ధరలు మారతాయి.
కంఫర్ట్ ప్యాకేజీ (3rd ఏసీ బెర్త్)..
సింగిల్ షేరింగ్ (ఒక్కరికి): రూ. 32,310
డబుల్ షేరింగ్ (ఇద్దరికి ఒక్కో వ్యక్తికి): రూ. 18,870
ట్రిపుల్ షేరింగ్ (ముగ్గురికి ఒక్కో వ్యక్తికి): 16,330
5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు (బెడ్‌తో): రూ. 10,190
5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు (బెడ్ లేకుండా) రూ. 7,860
ఇక స్టాండర్డ్ ప్యాకేజీ (స్లీపర్ బెర్త్)..
సింగిల్ షేరింగ్ (ఒక్కరికి): రూ. 29,580
డబుల్ షేరింగ్ (ఇద్దరికి ఒక్కో వ్యక్తికి): రూ. 16,140
ట్రిపుల్ షేరింగ్ (ముగ్గురికి ఒక్కో వ్యక్తికి): రూ. 13,600 (ముగ్గురు కలిసి ఒక్కొక్కరికి రూ. 13600 అవుతుంది. అంటే కేవలం రూ. 14 వేల లోపు ఉంటుంది.)
5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు (బెడ్‌తో): రూ. 7,460
5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు (బెడ్ లేకుండా) రూ.5,130
ఈ ప్యాకేజీలో ఏమేం వస్తాయంటే..?
మీరు ఎంచుకున్ ప్యాకేజీని బట్టి ఈ సౌకర్యాలు లభిస్తాయి.
3rd ఏసీ లేదా స్లీపర్ క్లాస్ రైలు ప్రయాణం.
కేరళలో పర్యటించడానికి ఏసీ వాహనం.
కేరళలో మూడు రాత్రులు హోటల్‌లో బస.
ఉదయం యాత్రికులకు అల్పాహారం ఉచితం.
యాత్రికులకు ట్రావెల్ ఇన్యూరెన్సు ఉంటుంది.
టోల్, పార్కింగ్ ఛార్జీలు ప్యాకేజీలోనే ఉంటాయి.
వీటి బాధ్యత యాత్రికులదే..
ప్యాకేజీలో కొన్ని ఖర్చులను చేర్చలేదు. అవి యాత్రికులే స్వయంగా చూసుకోవాల్సి ఉంటుంది.
మధ్యాహ్నం, రాత్రి భోజనాలు, ఎక్కడైనా ప్రవేశ రుసుములు, బూటింగ్, హార్స్ రైడింగ్ తదితర వాటిని యాత్రికులే చెల్లించాల్సి ఉంటుంది. గైడ్‌ను కావాలంటే ఏర్పాటు చేసుకోవచ్చు.
రద్దు చేసుకోవాలంటే..
ఒక వేళ టూరు రద్దు చేసుకోవాల్సి వస్తే.. ఈ నియమాలు వర్తిస్తాయి.
15 రోజుల ముందు రద్దు: రూ. 25 క్యాన్సిలేషన్ ఛార్జీ మినహాయించి మిగతా మొత్తం తిరిగి వెనక్కి చెల్లిస్తారు
8-14 రోజుల ముందు రద్దు: టికెట్ ధరలో 25 శాతం మినహాయిస్తారు.
4-7 రోజుల ముందు రద్దు: టికెట్ ధరలో 50 శాతం మినహాయిస్తారు.
4 రోజుల కంటే తక్కువ సమయంలో రద్దు: ఎలాంటి నగదు తిరిగి రాదు.
ఇవి కూడా చదవండి:
జగన్ పర్యటనలో అపశృతి.. ఒకరు మృతి
124 మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగింత..
For More National News and Telugu News