Share News

Hair Friendly Foods: రోజుకు ఇవి ఓ స్పూన్ తింటే చాలు జుట్టు రాలే సమస్య మాయం!

ABN , Publish Date - Jul 11 , 2025 | 08:23 PM

అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జుట్టును అమితంగా ప్రేమిస్తారు. అందుకే ఒత్తైన నిగనిగలాడే కురుల కోసం రోజులో కచ్చితంగా ఎంతో కొంత సమయాన్ని కేటాయిస్తారు. కానీ, ఇటీవలి కాలంలో జుట్టురాలే సమస్య పెరుగుతోంది. ఇందుకోసం ఎన్ని ప్రయత్నాలు చేసిన చాలాసార్లు అనుకున్న ఫలితం కనిపించదు. అయితే, రోజు ఈ చిన్ని విత్తనాలు తిన్నారంటే వెంటనే జుట్టు రాలే సమస్య ఆగిపోతుంది. కొన్ని నెలల్లోనే జుట్టు దట్టంగా మారుతుంది.

Hair Friendly Foods: రోజుకు ఇవి ఓ స్పూన్ తింటే చాలు జుట్టు రాలే సమస్య మాయం!
Best Foods for Hairgrowth

Best Foods for Hairgrowth: వెంట్రుకలు ఊడిపోయినంత వేగంగా పెరగవు. ఇది అందరికీ తెలిసిందే. జుట్టు పోషణ కోసం చాలా విషయాల్లో కేర్ తీసుకోవాలి. అందుకే ప్రతి ఒక్కరూ రోజూ వివిధ రకాల ప్యాక్‌లు, సీరమ్‌లు, నూనెలు ఒకదాని తర్వాత ఒకటి వాడేస్తుంటారు. అయినా చాలాసార్లు ఫలితం కనిపించదు. ఎందుకంటే జుట్టుకు బయటనుంచే కాక లోపల నుంచి కూడా తగినంత పోషకాలు అందాలి. అప్పుడే చుండ్రు, జుట్టు రాలడం తదితర సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అలాగే నిద్ర, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడంపైనా దృష్టి సారించాలి. లేకపోతే ఎంత కచ్చితమైన డైట్ పాటించినా ప్రయోజనం ఉండదు. ఇదిలా ఉంటే, జుట్టు రాలే సమస్య నివారించాలంటే రోజూ ఓ స్పూన్ ఈ చిన్ని విత్తనాలు చాలంటున్నారు పోషకాహార నిపుణులు.


జుట్టు రాలడానికి కారణాలు ఏమిటి?

సాధారణంగా జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉంటాయి. వీటిలో ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపాలు, హార్మోన్ల మార్పులు, చెడు అలవాట్లు ఉన్నాయి. ఇలాంటి సమస్యలు ఉంటే మీరు ఎంత కేర్ తీసుకున్నా జుట్టు రాలే సమస్య తగ్గదు.


పురుషులలో బట్టతల రాకూడదంటే..

పురుషులలో జుట్టు రాలడం సర్వసాధారణం. జుట్టు రాలడమే కాదు. బట్టతల కూడా వస్తుంది. ఇలా జరగకూడదంటే సమస్య మూలాన్ని కనుగొనాలి. సాధారణంగా పురుషులలో జుట్టు రాలడం డైహైడ్రోటెస్టోస్టెరాన్ అనే హార్మోన్ వల్ల వస్తుంది. కాబట్టి, జుట్టు పెరుగుదలకు సహాయపడే ఆహారాలను తింటే చాలు. అవేంటో చూద్దాం.

జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు సాధారణంగా అనేక రకాల ఆహారాలలో ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. దీని కోసం మాంసాహారులు తమ ఆహారంలో సాల్మన్, సార్డిన్‌లను చేర్చుకోవాలి. ఎందుకంటే ఈ చేపలలో ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇక శాకాహారులకు అవిసె గింజలు, చియా గింజలు, వాల్‌నట్‌లు మంచి వనరులు. కానీ అవిసె గింజలను రుబ్బుకోవడం ఉత్తమమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.


ఎంత మోతాదులో తీసుకోవాలి?

ప్రతిరోజూ 1 టేబుల్ స్పూన్ చియా గింజలు, 1 టేబుల్ స్పూన్ అవిసె గింజలు లేదా 7 వాల్‌నట్స్ తినండి. మీరు వీటిని క్రమం తింటూ ఉంటే జుట్టు 3 నుండి 6 నెలల్లోనే దట్టంగా పెరుగుతుంది. ఇవి జుట్టు రాలడాన్ని 90% కచ్చితంగా తగ్గిస్తాయి. కాబట్టి, ఖరీదైన నూనెలు, ప్యాక్‌లను ఉపయోగించే బదులు ఈ రకమైన ఆహారాన్ని తీసుకుంటే జుట్టు పెరుగుదలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.


(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Also Read:

భరణం హక్కు.. వరకట్నం నేరం.. ఎందుకిలా? అసలు కారణం ఇదే!

తినే విధానాన్ని బట్టి పర్సనాలిటీ కనుక్కోవచ్చని మీకు తెలుసా?
For More Lifestyle News

Updated Date - Jul 11 , 2025 | 08:43 PM