Share News

Jeans Pants: జీన్స్ ప్యాంట్లకు మినీ పాకెట్స్ ఎందుకు ఉంటాయో తెలుసా?

ABN , Publish Date - May 26 , 2025 | 01:40 PM

Jeans Mini Pockets Use: సింపుల్ అండ్ స్టైలిష్ లుక్ ఇచ్చే జీన్స్ అన్ని వయసుల వారికీ ఫేవరెట్. యువతలో చాలామంది రోజూ జీన్స్ వేసుకోవడానికే ఇష్టపడతారు. అయితే, జీన్స్‌కు కుడి వైపున మినీ పాకెట్ ఉంటుంది. పెద్ద జేబు లోపల ఈ చిన్న జేబు ఎందుకుంటుందో రోజూ జీన్స్ వేసుకుంటున్నా చాలామందికి తెలియదు. కానీ, దీని వెనక ఓ పెద్ద కథే ఉంది.

Jeans Pants: జీన్స్ ప్యాంట్లకు మినీ పాకెట్స్ ఎందుకు ఉంటాయో తెలుసా?
Why Jeans Have Small Pockets

Why Jeans Have Small Pockets: ఫ్యాషన్ ట్రెండ్స్ ఎప్పటికప్పుడు మారిపోతున్నా జీన్స్ కుర్రకారు ఆల్ టైం ఫేవరెట్ స్టైల్. స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ జీన్స్ ధరించడానికి ఇష్టపడతారు. పేద ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి వార్డ్ రోబ్‌లో జీన్స్ తప్పకుండా ఉంటుంది. అంతలా అందరి జీవితాలతో పెనవేసుకుపోయిన జీన్స్‌కు చిన్న జేబులు ఉండటం గమనించే ఉంటారు. ఇవి ఎందుకుంటాయో అని అడిగితే జీన్స్ ధరించేవారిలో 10 శాతం మంది కూడా చెప్పలేరు. ఎందుకని మీరెప్పుడైనా ఆలోచించారా?


జీన్స్‌లో చిన్న పాకెట్స్ ఎందుకు ఉంటాయి?

జీన్స్‌ ధరించడం 19వ శతాబ్దం నుంచే ప్రారంభమైంది. మొదట్లో శ్రామిక తరగతి ప్రజలు మాత్రమే జీన్స్ ధరించేవారు. వారి సౌలభ్యం కోసమనే తయారీసంస్థలు ఆ సమయంలో జీన్స్‌లో జేబుతో పాటు మినీ జేబు కూడా ఇచ్చేవి. ఎందుకంటే ఆ కాలంలో సమయం చూసుకునేందుకు రిస్ట్ వాచీలు లేవు. కేవలం పాకెట్ వాచీలే ఉండేవి. అందుకే జీన్స్ లో ఉండే జేబును "వాచ్ పాకెట్" అని పిలుస్తారు. కార్మికుడు పెద్ద జేబులో గడియారం పెట్టుకుంటే పనిచేసుకునేటప్పుడు విరిగిపోయే అవకాశం ఉంది. అందుకని కిందపడిపోకుండా జాగ్రత్తగా ఉండేందుకు ప్రత్యేకించి పాకెట్ గడియారాల కోసమే ఈ చిన్న జేబు ఏర్పాటు చేశారు. అయితే, ప్రస్తుతం ఇప్పుడెవరూ ఈ జేబును గడియారాలు పెట్టుకునేందుకు ఉపయోగించడం లేదు. బదులుగా అగ్గిపెట్టె, తాళం చెవి, కాయిన్స్ లాంటివి పడిపోకుండా ఉండేందుకు వినియోగిస్తున్నారు.


జీన్స్ మినీ పాకెట్ ను ఇప్పుడు ఏమంటున్నారు?

పాత కాలంలో జీన్స్‌లోని చిన్న జేబును వాచ్ పాకెట్ అని పిలిచేవారు. అయితే కాలక్రమేణా దీనికి అనేక పేర్లు వచ్చాయి. ప్రజలు ఇప్పుడు దీనిని కాయిన్ పాకెట్, మేచ్ బాక్స్ పాకెట్, టికెట్ పాకెట్ అని రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. ఇప్పుడు చాలా తక్కువ మంది ఈ పాకెట్‌ను ఉపయోగిస్తున్నప్పటికీ.. ఇప్పటికీ ఈ చిన్న జీన్స్ పాకెట్ అన్ని రకాల జీన్స్ ప్యాంట్లలో తప్పకుండా ఉంటుంది. ఈ మధ్య కొన్ని జీన్స్ మోడల్స్ లో ఈ మినీ పాకెట్ జేబు పరిమాణం కూడా పెంచారు.


Also Read:

నలుగురి దృష్టిలో పడాలంటే.. ఈ 4 టిప్స్ ఫాలో అవండి చాలు..

ఈ కారణాల వల్లే భార్యలు భర్తలను మోసగిస్తారు..

For More Lifestyle And Telugu News

Updated Date - May 26 , 2025 | 01:56 PM