Kailash Mansarovar: కైలాస పర్వతంపై ఆశ్చర్యపరిచే 5 మిస్టరీలు..
ABN , Publish Date - Apr 26 , 2025 | 02:21 PM
Kailash Mansarovaram Mysteries: మానససరోవరం ఒక ఆధ్యాత్మిక చిహ్నం మాత్రమే కాదు. భౌగోళిక అద్భుతం కూడా. ఇక్కడ ఎవరూ కనుగొనలేని లెక్కలేనన్ని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ప్రపంచం కనుగొనలేని ఈ 5 అద్భుతాలు ఇప్పటికీ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. అవేంటంటే..

Kailash Mansarovaram 5 Mysteries: కైలాస మానసరోవర్ యాత్ర జూన్ 30, 2025న ప్రారంభం కానుంది. శివుని నివాసంగా భావించే కైలాస పర్వతాన్ని దర్శించుకునేందుకు ఈ సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. మానస సరోవర యాత్రకు వెళ్లడాన్ని హిందువులు మాత్రమే కాదు. బౌద్ధులు, జైనులు, సిక్కులు కూడా పవిత్రంగా భావిస్తారు. స్వర్గానికి ముఖద్వారంగా పిలిచే కైలాస పర్వతంపై శాస్త్రవేత్తలు, ప్రపంచ యాత్రికులు వెలికితీయలేని ఎన్నో రహస్యాలు దాగున్నాయి. వాటిలో ప్రధానమైన 5 మిస్టరీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎక్కని శిఖరం
ఎవరెస్ట్ కంటే తక్కువ ఎత్తులో ఉన్న కైలాస పర్వతాన్ని ఇప్పటివరకు ఎవరూ అధిరోహించలేకపోయారు. 6,638 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పర్వతాన్ని ఎక్కేందుకు దేశవిదేశాల నుంచి వందల మంది ప్రయత్నించారు. కానీ, ప్రతి ఒక్కరూ విఫలమయ్యారు. కొందరు చనిపోయారు కూడా. ఈ పర్వతం ఎక్కడం మొదలుపెట్టినప్పటి నుంచే శరీరంలో అనేక రకాల మార్పులు మొదలవుతాయని, ఇందుకు కారణమేంటో ఇప్పటికీ అంతుపట్టడం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇతిహాసాల ప్రకారం పరమ శివుని నివాసంగా భావించే ఈ పర్వతాన్ని ఎక్కితే దాని పవిత్రతకు భంగం కలుగుతుందని భావిస్తారు.
జంట సరస్సులు
కైలాస పర్వతం వద్ద రెండు సరస్సులు ఉన్నాయి. మానసరోవర్ ను దేవతల సరస్సు అని పిలుస్తారు. మరొకటి రాక్షస తాల్ లేదా రాక్షస సరస్సు. ఒకే వాతావరణ పరిస్థితుల్లో పక్కపక్కనే ఉన్నప్పటికీ ఈ సరస్సుల్లోని నీటిలో చాలా తేడాలు కనిపిస్తాయి. మానసరోవరంలో నీరు తియ్యగా ఉంటే.. రాక్షస తాల్ నీరు ఉప్పగా ఉంటుంది. రెండు సరస్సుల నీటి నాణ్యత, రంగు వేర్వేరుగా ఉంటాయి. ఇలా ఎందుకు ఉన్నాయో సైన్స్ కూడా ఇప్పటికీ సమాధానం చెప్పలేకపోతోంది.
కాలం
కైలాస పర్వతంపై కాలం వేగంగా మారుతుంది. కైలాసాన్ని సందర్శించిన ప్రతి యాత్రికుడు ఇదే చెబుతాడు. ఇక్కడికి చేరుకున్న వెంటనే కాలం వేగం పెరుగుతుందని అంటారు. వాచ్ లు వేగంగా కదలడం ప్రారంభించి గందరగోళ స్థితిలోకి వెళ్లిపోతారని అంటారు. అందువలన, కైలాస పర్వతాన్ని టైమ్ వార్ప్ జోన్ అని కూడా పిలుస్తారు. అంతేకాదు, ఇక్కడ తక్కువ వ్యవధిలోనే జుట్టు, గోర్లు అసాధారణ రీతిలో పెరిగిపోతాయని.. అలాంటి సంఘటనలు బోలెడు ఉన్నాయని స్థానికులు అంటుంటారు.
పర్వతం ఆకారం
కైలాస పర్వతం ఆకారం ఇతర పర్వతాల కంటే భిన్నంగా ఉంటుంది. పై నుండి చూసినప్పుడు స్వస్తిక్ ఆకారంలో ఉన్నట్లు కనిపిస్తుంది. హిందూ మతంలో స్వస్తిక్ ను శుభ చిహ్నంగా భావిస్తారు. ఈ రకమైన ఆకారం ఉన్న పర్వతం ప్రపంచంలోని మరెక్కడా కనిపించదు. ఇది ప్రజలకు, శాస్త్రవేత్తలకు కూడా ఆసక్తి కలిగించే విషయం.
అద్దం లాంటి గోడ
కైలాస పర్వతం దక్షిణ భాగంలో మృదువుగా, నిటారుగా ఉన్న గోడ లాంటి నిర్మాణం కనిపిస్తుంది. చూసేందుకు ఒక పెద్ద అద్దంలా ఉంటుంది. శాస్త్రవేత్తలు కూడా ఈ నిర్మాణాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ నిర్మాణం ఎలా ఏర్పడిందనే దానిపై ఇప్పటికీ అంతు చిక్కడం లేదు.
ఇదే కాక, ఆసియాలోని నాలుగు ప్రధాన నదులైన సింధు, సట్లెజ్, బ్రహ్మపుత్ర, కర్నాలిలు కైలాస పర్వతం వద్దే ఉద్భవించాయి. అయితే, ఈ నదులు విచిత్రంగా పుట్టిన వెంటనే భూగర్భంలో అదృశ్యమై మళ్లీ వేరే ప్రాంతంలో ప్రత్యక్షమవుతాయి. ఇవి ఏ మార్గంలోంచి వస్తాయో ఇప్పటికీ కనుక్కోలేకపోతున్నారు.
Read Also: Chanakyaniti: జీవితంలో ఈ 3 విషయాలను ఎట్టిపరిస్థితిలోనూ తక్కువ అంచనా వేయకండి..
Hyperpigmentation: వేసవిలో హైపర్‌పిగ్మెంటేషన్ సమస్య ఎందుకు పెరుగుతుంది..
Gas Stove Burner: గ్యాస్ స్టవ్‌పై నల్లటి మరకలు ఉంటే.. ఇలా చేస్తే తెల్లగా అవుతుంది!