Stress Relief:ఒత్తిడిని చిటికెలో తరిమేసే 5 పవర్‌ఫుల్ టెక్నిక్స్..
ABN , Publish Date - May 05 , 2025 | 02:51 PM
Stress Relief Techniques: ఎంత ప్రశాంతంగా ఉండాలని ప్రయత్నించినా నేటి బిజీ జీవితంలో అది అసాధ్యమే. ఒత్తిడి సమస్య అన్నది ప్రస్తుతం చాలా కామన్ గా మారింది. కానీ, అధిక ఒత్తిడి మానసికంగా, శారీరకంగా మిమ్మల్ని కుంగదీయవచ్చు. కాబట్టి, ఒత్తిడిగా అనిపించినప్పుడు వెంటనే ఇలా చేయండి. మనస్సు తేలికై ఉత్సాహం తిరిగొస్తుంది.

Quick Ways To Reduce Stress: రోజువారీ బిజీ షెడ్యూల్ కారణంగా చాలా మంది తమకంటూ సమయం కేటాయించుకోలేకపోతున్నారు. తీరిక లేని జీవితం గడుపుతూ ఒత్తిడికి గురవుతున్నారు. ఈ కారణంగా మనస్సు కుదురుగా ఉండదు. నిత్యం ఆందోళనగానే అనిపిస్తూ ఉంటుంది. ఇక ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏదైనా విషయంపై నిర్ణయాలు తీసుకోవాలన్నా తికమకపడతారు. ఇక పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఉద్రిక్తతలు అణుచుకోవడం కష్టమై మరింత ఒత్తిడికి గురవుతారు. కానీ, కొన్ని చిన్న చిన్న పద్ధతుల పాటించడం ద్వారా ఎంత టెన్షన్ ఉన్నా ఇట్టే పోగొట్టుకోవచ్చు.
దీర్ఘ శ్వాస
ఒత్తిడిగా అనిపించిన సమయంలో ముక్కుతో అదే పనిగా కొన్ని సెకన్ల పాటు దీర్ఘ శ్వాస తీసుకోండి. ఆ తర్వాత నోటి ద్వారా నెమ్మదిగా గాలిని వదిలివేయండి. మీరు ఇలా చేస్తే దృష్టి శ్వాస పైకి మళ్లుతుంది. ఇలా ఒక 5-10 నిమిషాలు చేయండి. మనసులోని భారం తొలగిపోయి ఉపశమనం కలుగుతుంది.
మైండ్‌ఫుల్‌నెస్ సాధన
మీ పరిసరాలు, శరీర అవయవాల పనితీరును శ్రద్ధగా గమనించండి. అవసరమైతే 5-4-3-2-1 టెక్నిక్‌ని ప్రయత్నించవచ్చు. ఎలా అంటే మీరు చూడగలిగే 5 విషయాలు, తాకగలిగే 4 విషయాలు, వినగలిగే 3 విషయాలు, వాసన చూడగలిగే 2 విషయాలు, రుచి చూడగలిగే 1 విషయాన్ని గుర్తించండి.
నడక
ఉద్రిక్తత మధ్య మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఉత్తమ మార్గం బయటకు వెళ్లి కొన్ని నిమిషాలు నడవడం. ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న వాతావరణంపై దృష్టి పెట్టండి.
ప్రశాంతమైన సంగీతం
చాలా ఒత్తిడి మధ్య సంగీతం వినడం కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలనుకుంటే మనసును ప్రశాంతంగా చేసే మ్యూజిక్ వినండి. సంగీతం హృదయ స్పందన రేటు, రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.
చూయింగ్ గమ్
చాలా మంది చూయింగ్ గమ్ తినడానికి ఇష్టపడరు కానీ ఒత్తిడి మధ్య మీ మనసును ప్రశాంతంగా ఉంచడంలో ఇది మీకు సహాయపడుతుంది. ఒత్తిడిగా అనిపించిన వెంటనే చూయింగ్ గమ్ నమలడం ప్రారంభించండి. దీనివల్ల ఒత్తిడిని పెంచే కార్టిసాల్ హార్మోన్ విడుదల తగ్గిపోతుంది. మనసు, శరీరం వేగంగా ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఇదో చక్కటి మార్గం.
Read Also: Parenting Tips: తల్లిదండ్రుల ఈ అలవాట్ల వల్ల పిల్లలు వారిని ద్వేషిస్తారు..
Chanakya Niti: జీవితంలో అదృష్టవంతులు మాత్రమే వీటిని పొందుతారు..
Cleaning Tips: ఇల్లు శుభ్రం చేసేటప్పుడు.. జస్ట్ ఇలా చేయండి..