Share News

Premature Greying: తెల్ల జుట్టు వస్తోందా? ఆందోళవద్దు.. ఈ సింపుల్ చిట్కాలతో బై బై చెప్పేయండి..!

ABN , Publish Date - Jul 03 , 2025 | 07:25 PM

Anti-Greying Hair Tips: చిన్నవయసులోనే తెల్లజుట్టు విపరీతంగా పెరిగిపోతోందా? మాటిమాటికీ కలర్ వేసుకోవాల్సి వస్తోందని బాధపడుతున్నారా? ఇకపై బాధపడాల్సిన అవసరం లేదు. ఈ వంటింటి చిట్కాలతో నల్లటి నిగనిగలాడే జుట్టు తిరిగి మీ సొంతమవుతుంది.

Premature Greying: తెల్ల జుట్టు వస్తోందా? ఆందోళవద్దు.. ఈ సింపుల్ చిట్కాలతో బై బై చెప్పేయండి..!
Anti-Greying Hair Tips

Natural Ways to Stop Premature Hair Greying: వృద్ధాప్యంలో జుట్టు తెల్లబడటం సహజం. కానీ, నేటికాలంలో చాలా మందికి చిన్నతనంలోనే తెల్లటి లేదా బూడిద రంగు జుట్టు వచ్చేస్తోంది. ఇది కేవలం అందానికే సంబంధించిన విషయం కాదు. ఆరోగ్యానికి కూడా సంకేతం. వేగవంతమైన జీవనశైలి, ఒత్తిడి, అసమతుల్య ఆహారాలే ఈ సమస్యకు మూల కారణాలు. ముఖ్యంగా 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారిలో జుట్టు తెల్లబడటానికి జీవనశైలి, జన్యుపరమైన అంశాలే ప్రధాన కారకాలుగా ఉన్నాయి. కానీ, ఈ సమస్యకు ప్రకృతి నుంచి పరిష్కారం పొందవచ్చు. ఈ కింది సహజ చిట్కాలతో జుట్టు తెల్లబడే ప్రక్రియను తిప్పికొట్టవచ్చు.


1. ఆమ్లా

ఆమ్లాలో ఉండే విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టుకు అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఇది మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. తద్వారా జుట్టు సహజంగా నల్లగా మారుతుంది. మీరు ఆమ్లా జ్యూస్ తాగడం లేదా తలపై ఆమ్లా నూనె మర్దన చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.

2. కరివేపాకు + కొబ్బరి నూనె

ఇది దశాబ్దాలుగా ఉపయోగిస్తున్న ఇంటి చిట్కా. కరివేపాకు జుట్టుకు బలం ఇచ్చి పిగ్మెంటేషన్‌ను మెరుగుపరుస్తుంది. దీనిని కొబ్బరి నూనెలో మరిగించి తలపై అప్లై చేయండి.

3. ఉల్లిపాయ రసం

ఉల్లిపాయలో ఉండే Catalase అనే ఎంజైమ్ హెయిర్ ఫాలికల్స్‌లో హైడ్రోజన్ పెరోక్సైడ్‌ను తగ్గించి జుట్టు రంగును కాపాడుతుంది. స్కాల్ప్ పై 30 నిమిషాలు ఉల్లిపాయ రసం అప్లై చేసి శుభ్రంగా కడగాలి.

4. కొబ్బరి నూనె + నిమ్మరసం

నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ స్కాల్ప్‌ను శుభ్రపరచడం ద్వారా పిగ్మెంటేషన్‌ను మెరుగుపరుస్తుంది. కొబ్బరి నూనెతో కలిపి నెమ్మదిగా మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం దక్కుతుంది.


5. బ్లాక్ టీ

బ్లాక్ టీలో ఉండే టానిన్లు జుట్టు నల్లగా ఉంచడంలో సహాయపడతాయి. బ్లాక్ టీని మరిగించి చల్లారిన తర్వాత తలపై పోయాలి.

6. హెన్నా, ఆమ్లా పౌడర్ మిక్స్

హెన్నా సహజమైన హెయిర్ కలర్‌గా పని చేస్తుంది. దీనిని ఆమ్లా, నిమ్మరసంతో కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమం జుట్టుకు రంగును అందించడమే కాక ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది.

7. అలోవెరా జెల్

అలోవెరా జెల్ స్కాల్ప్‌ను తేమగా ఉంచుతుంది. దీనికి పిగ్మెంటేషన్ మెరుగుపరిచే గుణం ఉంది. దీన్ని స్కాల్ప్‌పై రుద్దితే ఉత్తమమైన ఫలితం ఉంటుంది.

8. నువ్వులు (బ్లాక్ సెసేమీ )

నువ్వులు చర్మాన్ని, జుట్టును బలోపేతం చేస్తాయి. వీటిలో ఉండే కాల్షియం, ఐరన్, మ్యాగ్నీషియం వంటి పోషకాలు మెలనిన్ ఉత్పత్తిని పెంచుతాయి.


(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)


Also Read:

మీ భార్య తరచుగా కోపంగా ఉంటుందా.. ఇలా కూల్ చేయండి..

సహజ సౌందర్యానికి ముక్కుపుడక..దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..

For More Lifestyle News

Updated Date - Jul 03 , 2025 | 07:53 PM