Skin Care: ఈ 5 అలవాట్లతో వర్షాకాలంలో స్కిన్ అలెర్జీలు..
ABN , Publish Date - Jun 28 , 2025 | 02:42 PM
Monsoon Skin Allergies: వర్షాకాలంలో దురద, దద్దుర్లు ఇలా అనేక రకాల చర్మసమస్యలు తరచూ వేధిస్తుంటాయి. వాతావరణ పరిస్థితుల కంటే మనం రోజూ అనుసరించే ఈ 5 అలవాట్లే ప్రధాన కారణం అంటున్నారు చర్మనిపుణులు. కాబట్టి, చర్మం కాంతివంతంగా ఉండాలంటే దైనందిన జీవితంలో ఈ తప్పులు చేయడం మానేయండి.

Causes of Skin Allergy in Rainy Season: వానాకాలం చర్మ అలెర్జీలు పెరగడానికి అనుకూలంగా ఉంటుంది. దీనివల్ల బ్యాక్టీరియా మరియు ఫంగస్ వేగంగా పెరుగుతాయి. తడి వాతావరణం కారణంగా చర్మం త్వరగా ప్రభావితమవుతుంది. ఈ సీజన్లో చలి కూడా కాస్త ఎక్కువగా ఉండటం వల్ల ప్రజల శారీరక పరిశుభ్రత విషయంలో కాస్త నిర్లక్ష్యంగా ఉంటారు. దీంతో చర్మరంధ్రాలు మూసుకుపోయి చెమట అంతగా పట్టదు. ఈ కారణంగానే చర్మ వ్యాధులు సంక్రమించే ప్రమాదం మరింత పెరుగుతుంది.
వర్షాకాలంలో ఈ తప్పులు చేస్తే చర్మ అలెర్జీలు
వర్షాకాలంలో అందరూ అత్యంత సాధారణంగా చేసే తప్పు ఏమిటంటే తడి దుస్తులలో ఎక్కువసేపు ఉండటం. వర్షంలో తడిసిన తర్వాత తడి సాక్స్, లోదుస్తులు లేదా బట్టలు మార్చుకోవడంలో మీరు నిర్లక్ష్యం చేసినప్పుడు చర్మంపై తేమ అలాగే ఉంటుంది. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకేందుకు కారణమవుతుంది.
కొందరు బిగుతుగా లేదా సింథటిక్ దుస్తులు ధరిస్తుంటారు. కానీ, వర్షాకాలంలో బయట చల్లగా ఉన్నప్పటికీ గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల శరీరంపై పదే పదే చెమట పడుతుంది. వేడి పుట్టించే సింథటిక్ దుస్తులు ధరించినపుడు చెమట చర్మంపై పేరుకుపోయి అలెర్జీలు ప్రారంభమవుతాయి.
వర్షాకాలంలో చర్మం పైభాగంలో దుమ్ము, చెమట పేరుకుపోతాయి. మీరు రోజుకు కనీసం రెండుసార్లు ముఖం, శరీరాన్ని సరిగ్గా కడగకపోతే రంధ్రాలు మూసుకుపోయి చర్మపు దద్దుర్లు సంభవించవచ్చు.
తడి బూట్లు లేదా చెప్పులు ధరింస్తే పాదాల నుంచి దుర్వాసన వస్తుంది. దీనివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. అలాగే ఎక్కువ క్రీమ్ లేదా మాయిశ్చరైజర్ వాడటం వల్ల చర్మం జిగటగా మారుతుంది. ఇది అలెర్జీలు, ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది.
ఆహారపు అలవాట్లు కూడా చర్మ అలెర్జీలకు దారితీస్తాయి. చినుకులు కురిసే వేళలో వీధి పక్కన లభించే ఆహారం చర్మ అలెర్జీకి కారణం అయ్యే అవకాశముంది. అపరిశుభ్ర వాతావరణంలో వండిన ఆహారం శరీరం లోపల నుంచే అలెర్జీలను పుట్టిస్తుంది. కాబట్టి, వర్షాకాలంలో రోడ్డు పక్కన లభించే వేయించిన ఆహారాలు తినవద్దు.
వర్షాకాలంలో చర్మ ఆరోగ్యానికి ముఖ్యమైన చిట్కాలు
తడి బట్టలు/సాక్స్ వెంటనే మార్చండి
గాలి తగిలేలా కాటన్ దుస్తులు ధరించండి.
రోజుకు రెండుసార్లు చర్మాన్ని శుభ్రం చేసుకోండి
గాఢత కలిగిన చర్మ ఉత్పత్తులను వాడటం మానుకోండి.
స్నానం చేసేటప్పుడు నీటిలో యాంటీసెప్టిక్ ద్రవం లేదా వేపాకులు కలపండి.
స్నానం చేసిన తర్వాత మీరు యాంటీ ఫంగల్ పౌడర్ ఉపయోగించవచ్చు.
Also Read:
మీరు ఆఫీస్‌కి వెళ్తున్నారా? ఈ సమస్యలు తప్పవు.. సైంటిస్టుల సర్వేలో
పళ్ల చిగుళ్లు ఎందుకు ఉబ్బుతాయి? నివారణకు ఏం చేయాలి?
For More Health News