Premature Aging: ఈ చెడు అలవాట్లతో చిన్నవయసులోనే ముసలివారిలా కనిపిస్తారు..!
ABN , Publish Date - Jun 23 , 2025 | 02:33 PM
Premature Aging Reasons: ఉరకలెత్తే నవయవ్వనంలోనూ ముడతలు పడి చర్మం నిర్జీవంగా కావడానికి ఈ చెడు అలవాట్లే కారణమని హెచ్చరిస్తున్నారు వైద్యులు. మీ దినచర్యలో ఏ అలవాట్లు వృద్ధాప్యం ఆవహించడానికి దోహదపడతాయో చెపితే ఆశ్చర్యపోతారు. మీ చెడు జీవనశైలి ఆయుష్షును తగ్గించడంతోపాటు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు బాటలు వేస్తుంది.

How Lifestyle Effects Your Aging: ఈ స్పీడ్ యుగంలో కోరికలు, లక్ష్యాల వెంట మనుషులు పరుగెడుతూనే ఉన్నారు. నిత్యం ఒత్తిడిని మోస్తూ అనారోగ్యకర జీవనశైలితో జీవనం సాగిస్తున్న వారి సంఖ్య సమాజంలో పెరిగిపోతోంది. మనం ప్రతిదినం తినే ఆహారాలు వృద్ధాప్యానికి కారణమవుతాయనంటే నమ్ముతారా.. కానీ ఇది నిజం. మీరు ఏమి తింటారు అనే దాని నుంచి ఒత్తిడిని సమస్యల వరకూ అనేక అంశాలు చిన్నతనంలోనే ముసలివారిలా కనిపించేలా ప్రభావితం చేస్తాయి. ఇది మీ దీర్ఘకాలిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి, ఈ కింది చెడు అలవాట్లను వెంటనే వదలించుకోండి.
ధూమపానం
వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేసే అత్యంత హానికరమైన అలవాట్లలో ధూమపానం ఒకటి. ఇది చర్మం స్థితిస్థాపకతను దెబ్బతీస్తుంది. శరీరంలో రక్త ప్రవాహ వేగాన్ని తగ్గించి ముడతలు, నిస్తేజమైన చర్మానికి దారితీస్తుంది. ఇది కాలేయం సహా మొత్తం శరీర ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.
మద్యం సేవించడం
అధికంగా మద్యం సేవించడం వల్ల వృద్ధాప్య సంకేతాలు మీలో కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఎందుకంటే, మద్యం చర్మాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. వాపుకు కారణమవుతుంది. అధికంగా మద్యం సేవించడం వల్ల కాలక్రమేణా కాలేయ పనితీరూ దెబ్బతింటుంది.
విటమిన్ డి
చక్కని ముఖవర్చస్సు, ఆరోగ్యం కోసం సూర్యరశ్మి నుంచి లభించే ఫ్రీ విటమిన్ అంటే డి-విటమిన్ చాలా అవసరం. అయితే, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య సూర్యరశ్మికి దూరంగా ఉంటే మంచిది ఎందుకంటే, ఆ సమయంలో కాసే ఎండ చర్మం వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది. సన్ స్క్రీన్ లేదా టోపీలు వంటి టిప్స్ పాటించకపోతే సూర్యరశ్మి వల్ల చర్మంపై మచ్చలు, సన్నని గీతలు, ముడతలు వచ్చి వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తాయి.
దీర్ఘకాలిక నిర్జలీకరణం
సరైన హైడ్రేషన్ అంటే తగినంత నీరు తాగకపోతే దీర్ఘకాలిక డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. ఇలాంటివరిలో చర్మం పొడిబారిపోయి పొలుసులుగా ఊడిపోయి పాలిపోయినట్లు అవుతుంది. అలసిపోయినట్లు కనిపిస్తారు.
ప్రాసెస్ ఆహారాలు, చక్కెర
చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలు జీవక్రియను ప్రభావితం చేయడమే కాకుండా చర్మ సమస్యలు, వాపుకు కారణమవుతాయి. కుంగుబాటు, చర్మంపై ముడతలు వంటి వృద్ధాప్య అకాల సంకేతాలకు దారితీస్తుంది.
ఒత్తిడి
వృద్ధాప్యానికి ఒత్తిడి ప్రధాన కారణం. దీర్ఘకాలిక ఒత్తిడి హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది, నిద్రను ప్రభావితం చేస్తుంది. ముఖంపై మచ్చలు లేదా కళ్ళ కింద నల్లటి వలయాలకు కారణమవుతుంది. ఒత్తిడిని కంట్రోల్ చేయడానికి 'భ్రమరి ప్రాణాయామం' చేయడం చాలా మంచిది.
Also Read:
డెంగ్యూ సీజన్ మొదలైంది జాగ్రత్త.. ఇంట్లోకి దోమలు రాకుండా ఉండేందుకు ఇలా చేయండి..
వయసు కాదు.. ఈ అలవాట్లే కీళ్ల నొప్పులు, మోకాలి నొప్పులకు కారణం..!
For More Health News