Share News

Cleaning Tips: అడుగంటిన పాత్రలు ఎంత రుద్దినా పోకపోతే ఈ పొడి వాడండి.. చిటికెలో మెరిసిపోతుంది..

ABN , Publish Date - Jul 16 , 2025 | 07:17 PM

వంట చేసేటప్పుడు పాత్రలు అడుగంటడం లేదా నల్లగా మాడిపోవడం సహజం. దీన్ని శుభ్రం చేయడం చేతకాక స్క్రబ్‌తో రుద్ది రుద్ది అలసిపోతుంటారు. ఎంతోసేపటికి గానీ పాత్ర మాములు స్థితికి రాదు. కానీ, ఇంతగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ పొడి ఉంటే చాలు. క్షణాల్లో నల్లగా మాడిన పాత్రలు తళతళలాడతాయ్..

Cleaning Tips: అడుగంటిన పాత్రలు ఎంత రుద్దినా పోకపోతే ఈ పొడి వాడండి.. చిటికెలో మెరిసిపోతుంది..
Burnt Kadai Cleaning Tips

How to Clean Burnt Kadai: వంట చేసేటప్పుడు పాత్రలు అడుగంటడం లేదా నల్లగా మాడిపోవడం సహజం. వంట చేసేవారికందరికీ ఏదొక సందర్భంలో ఈ సమస్య ఎదురవుతుంది. మంట ఎక్కువైతే పాత్రలోని ఆహారపదార్థాలు అడుగంటిపోతాయి. దీన్ని శుభ్రం చేయడం అసాధ్యం అనిపిస్తుంది. అందుకే చాలా మంది డిష్ వాషింగ్ లిక్విడ్ పూయడం లేదా నీళ్లుపోసి రాత్రంతా నానబెడతారు. ఆ తర్వాత కూడా చాలాసేపు స్క్రబ్బర్‌తో రుద్దుతూనే ఉంటారు. కానీ అడుగంటిన లేదా నల్లగా తయారైన కడాయి లోపలి లేదా అడుగు భాగాలను శుభ్రం చేయడానికి ఒక చక్కటి మార్గం ఉంది. కిచెన్లో ఎప్పుడూ ఉంటే ఈ పదార్థాన్ని వేస్ట్ గా పడేయకుండా వంటసామాగ్రిని శుభ్రం చేయడానికి వాడితే అద్భుతంగా పనిచేస్తుంది.


టీ పొడితో మాడిన పాత్రలను శుభ్రపరిచడమెలా?

1. కాచిన టీ ఆకులు లేదా పొడిని వడకట్టిన తర్వాత పారవేయకండి. ఇందులోని నీటిని పూర్తిగా తీసేసి ఒక పక్కన పెట్టుకోండి. నల్లగా మారిన పాత్రలను శుభ్రంచేసుకోవడానికి ఇది పనికొస్తుంది. ఒక పాత్రకు 2-3 టేబుల్ స్పూన్ల పొడి ఉపయోగిస్తే చాలు.

2.కడాయి నల్లగా మారిన ప్రాంతంలో టీ ఆకుల పొడిని చల్లండి. పాత్ర అడుగు భాగం మునిగేవరకూ నీరు పోయండి. ఇలా చేయడం వల్ల మాడిన ప్రాంతం మృదువుగా తయారవుతుంది. సులభంగా శుభ్రం చేసుకోవచ్చు.

3. ఇప్పుడు కడాయిని స్టవ్ మీద ఉంచి మీడియం మంట మీద 10 నుంచి 15 నిమిషాలు మరిగించండి.

4. స్క్రబ్బింగ్ చేసే ముందు కడాయిని మంట మీద నుంచి తీసి కొంచెం చల్లారనివ్వండి.

5. ఇప్పుడు సాధారణ స్క్రబ్బర్ ఉపయోగించి కాలిన అడుగు భాగాన్ని సున్నితంగా రుద్దండి. మాడిన ఆహారం, మరకలు చాలా సులభంగా తొలగిపోతాయి. నీటితో శుభ్రం చేసి ఎప్పటిలాగే కడగాలి.


Also Read:

మెగ్నీషియం లోపంతో ప్రాణాలకే ముప్పు..! ఈ లక్షణాలు కనిపిస్తే బీ అలర్ట్..!

ఉల్లిపాయలు కుళ్ళిపోకుండా ఎలా నిల్వ చేసుకోవాలి? ఈ సింపుల్ టిప్స్ మీ కోసం..

For More Lifestyle News

Updated Date - Jul 16 , 2025 | 07:18 PM