Share News

Fridge Odor Remover: క్లీన్ చేసినా ఫ్రిజ్ దుర్వాసన వస్తోందా.. ఈ టిప్స్‌తో ఈజీగా వదిలిపోతుంది..

ABN , Publish Date - Apr 20 , 2025 | 10:19 AM

Fridge Bad Smell Remover Tips: ఫ్రిజ్‌లో రకరకాల పదార్థాలు నిల్వ చేయడం వల్ల అన్ని వాసనలు కలిసిపోతాయి. అలాగే ఎక్కువ రోజులు ఉంచితే కొన్నాళ్ల తర్వాత ఒక విధమైన దుర్వాసన వస్తుంది. ఎంత శుభ్రం చేసినా పోనే పోదు. ఈ సమస్య పోవాలంటే ఈ సింపుల్ చిట్కాలను ప్రయత్నించి చూడండి.

Fridge Odor Remover: క్లీన్ చేసినా ఫ్రిజ్ దుర్వాసన వస్తోందా.. ఈ టిప్స్‌తో ఈజీగా వదిలిపోతుంది..
Fridge Bad Smell Remover Tips

Natural Fridge Odor Remover Tips: ఫ్రిజ్‌లో కూరగాయలు, పండ్లు, వండిన ఆహారపదార్థాలు ఇలా అన్ని కలగలపి నిల్వ చేస్తారు. అయితే, కొన్ని రోజుల తర్వాత వీటి కారణంగా వచ్చే దుర్వాసన అసహ్యంగా, భయంకరంగా ఉంటుంది. ఎంత శుభ్రం చేసిన మళ్లీ కుళ్లిన వాసనే వస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ముఖ్యంగా పండ్లు చాన్నాళ్లు ఉంచితే ఇలా జరుగుతుంది. ఇక పుచ్చకాయ లేదా ఆపిల్‌ను ఫ్రిజ్‌లో ఉంచితే ఫ్రిజ్ మొత్తం సువాసనతో నిండిపోతుందని భావిస్తుంటారు. కానీ, వీటి బదులుగా దుర్వాసనను వదిలించుకునేందుకు ఈ సింపుల్ రెమెడీస్ ఫాలో అయితే చాలు. దుర్వాసన సమస్య ఎప్పటికీ రాదు.


చాలా సార్లు కట్ చేసిన పండ్లు లేదా ముఖ్యంగా పుచ్చకాయలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల దుర్వాసన వస్తుంది. అటువంటి దుర్వాసనను తొలగించడంలో ఈ 3 చిట్కాలు సమర్థవంతంగా ఉపయోగపడతాయి. అవేంటో తెలుసుకోండి.


వంట సోడా

రెండు నుండి మూడు చెంచాల బేకింగ్ సోడాను ఒక గాజు గిన్నెలో వేసి రిఫ్రిజిరేటర్‌లో ఉంచండి. బేకింగ్ సోడా ఎలాంటి వాసననైనా గ్రహిస్తుంది. కాబట్టి, ఫ్రిజ్ వాసన రాకుండా ఉంటుంది. పది నుంచి పదిహేను రోజుల ఆ గిన్నెను మారుస్తూ ఉంటే చాలు. ఫ్రిజ్ నుంచి చెడు వాసనలు రావు.


ముక్కలు చేసిన నిమ్మకాయ

ఫ్రిజ్‌లోని నుంచి చెడు వాసన వస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఒక నిమ్మకాయ ముక్కను ఫ్రిజ్‌లో ఉంచండి లేదా ఒక గిన్నెలో కొంచెం నిమ్మకాయను పిండి వేయండి. దీనివల్ల ఫ్రిజ్ నుండి వచ్చే దుర్వాసన తొలగిపోతుంది.


ఉడికించిన వెనిగర్

ఫ్రిజ్ నుండి దుర్వాసన వస్తుంటే ఒక గిన్నెలో ఒక మూత వెనిగర్ వేసి మరిగించాలి. ఇప్పుడు దానిని మరో గిన్నెలోకి మార్చి ఫ్రిజ్‌లో ఉంచండి. ఫ్రిజ్ నుండి వచ్చే ఏదైనా వాసనను అయినా వెనిగర్ ఇట్టే గ్రహిస్తుంది.


Read Also: Parenting Tips: తల్లిదండ్రులు చేసే ఈ తప్పులు.. పిల్లల చదువును పాడు చేస్తాయి..

Tan Removal Tips: రోజూ ఈ లోషన్ వాడితే ట్యానింగ్ సమస్య ఎప్పుడూ రాదు..

Scam Alert: యాత్రికులు, టూరిస్టులకు కేంద్రం అలర్ట్..

Updated Date - Apr 20 , 2025 | 10:20 AM