Butter Chicken Recipe: సండే స్పెషల్‌గా బటర్ చికెన్ రెసిపీ.. ఎలా చేయాలో తెలుసుకుందాం..
ABN , Publish Date - Aug 03 , 2025 | 03:21 PM
ఈ ఆదివారం స్పెషల్‌గా ఏదైనా వండాలనుకుంటున్నారా? అయితే ఈ క్రీమీ, మసాలా రుచులతో నిండిన బటర్ చికెన్ రుచి తప్పకుండా ట్రై చేయండి.

ఇంటర్నెట్ డెస్క్: ఈ ఆదివారం స్పెషల్‌గా ఏదైనా వండాలనుకుంటున్నారా? అయితే ఈ క్రీమీ, మసాలా రుచులతో నిండిన బటర్ చికెన్ రుచి తప్పకుండా ట్రై చేయండి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికి నచ్చే విధంగా ఉంటుంది. అన్నం, చపాతీలు, పుల్కాలకూ సరిపోయేలా ఉంటుంది.
కావలసిన పదార్థాలు:
మెరినేషన్ కోసం:
బోన్‌లెస్ చికెన్ – 250 గ్రాములు
అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
చిక్కటి పెరుగు – 2 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం – అర చెక్క
కారం – 1 టీస్పూన్
గరం మసాలా – ½ టీస్పూన్
ఉప్పు – తగినంత
నూనె – 1 టేబుల్ స్పూన్
మసాలా పేస్ట్ కోసం:
బటర్ – 1 టేబుల్ స్పూన్
నూనె – 1 టేబుల్ స్పూన్
ఉల్లిపాయలు – 2 (మధ్య పరిమాణం)
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
టమోటాలు – 3 (సన్నగా తరిగినవి)
ఎండు మిర్చి – 3
జీడిపప్పు – 10
జీలకర్ర పొడి – 1 టీస్పూన్
ధనియాల పొడి – ½ టీస్పూన్
గరం మసాలా – 1 టీస్పూన్
ఉప్పు – తగినంత
నీళ్లు – 2 టేబుల్ స్పూన్లు
బటర్ చికెన్ కోసం:
బటర్ – 2 టేబుల్ స్పూన్లు
కారం – 1 టీస్పూన్
ఫ్రెష్ మీగడ – ¼ కప్పు
కసూరి మేతి – చిటికెడు
కొత్తిమీర – తరిగినంత
తయారీ విధానం:
ముందుగా చికెన్ ముక్కలు మెరినేట్ చేయాలి. ఒక గిన్నెలో చికెన్ ముక్కలు తీసుకుని పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలిపి 30 నిమిషాలు పక్కన పెట్టాలి.
స్టవ్ పై నూనె వేసి మెరినేట్ చేసిన చికెన్ ముక్కలు వేసి బాగా వేయించాలి. ఇవి బాగా గోధుమ రంగు వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
అదే పాన్‌లో బటర్, నూనె వేసి తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించాలి. తర్వాత టమోటాలు, జీడిపప్పు, ఎండు మిర్చి వేసి మగ్గించాలి. తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి మరో 2-3 నిమిషాలు వండాలి. చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తగా రుబ్బాలి.
పాన్‌లో మళ్లీ బటర్ వేసి, కారం పొడి వేసి వాసన వచ్చే వరకు వేయించాలి. దానికి టమోటా-ఉల్లి పేస్ట్ వేసి మిగిలిన మసాలాలతో కలపాలి. ఈ మిశ్రమం నుండి నూనె బయటికొస్తే ఫ్రై చేసిన చికెన్ ముక్కలు వేసి బాగా కలపాలి.
చివరగా ఫ్రెష్ మీగడ, కసూరి మేతి, కొత్తిమీర వేసి 5-10 నిమిషాలు మగ్గించాలి.
ఈ బటర్ చికెన్‌ను వేడి వేడి అన్నం, చపాతీలతో తింటే రుచి అదిరిపోతుంది.
Also Read:
రోజూ డైట్ సోడా తాగుతున్నారా? 38% పెరుగుతున్న డయాబెటిస్ రిస్క్ .!
హైదరాబాద్ ఐటీ ఉద్యోగుల్లో 84 శాతం మందికి ఫ్యాటీ లివర్ వ్యాధి.. నివేదికలో సంచలన విషయాలు..
For More Lifestyle News