Jalebi Fafda: జిలేబి - ఫాఫ్డా.. ఈ స్నాక్ హైదరాబాద్‌లో ఎక్కడ దొరుకుతుందో మీకు తెలుసా?
ABN , Publish Date - Aug 02 , 2025 | 07:30 PM
జిలేబి - ఫాఫ్డా గుజరాతీ వంటకాలలో చాలా ఫేమస్. ఈ రెండింటిని సాధారణంగా కలిపి తింటారు. జిలేబి మైదా పిండితో చేసిన ఒక స్వీట్. ఫాఫ్డా శనగపిండితో చేసిన క్రిస్పీ స్నాక్. ఈ రెండూ..

ఇంటర్నెట్ డెస్క్: జిలేబీ - ఫాఫ్డా గుజరాతీ వంటకాలలో చాలా ఫేమస్. ఫాఫ్డా అనేది శనగపిండితో చేసిన వేయించిన స్నాక్, ఇది కరకరలాడుతూ ఉంటుంది. జిలేబి అనేది మైదా పిండితో చేసిన తియ్యటి, సిరప్‌లో ముంచిన స్వీట్. ఈ రెండింటినీ కలిపి తినడం గుజరాత్‌లో చాలా సాధారణం.
ఫాఫ్డాను శనగపిండి, క్యారమ్ గింజలు, ఉప్పు, పాపడ్ ఖార్‌తో తయారు చేస్తారు. ఇవి తేలికగా, కరకరలాడుతూ కారంగా ఉంటుంది. సాధారణంగా వేయించిన పచ్చిమిరపకాయలు, శనగపిండి చట్నీ, సాంబారోతో తింటారు. జిలేబిని ఎలా చేస్తారంటే.. మైదా పిండిని మజ్జిగ లేదా నీటితో కలిపి, సుడిగుండాల ఆకారంలో వేయించి, చక్కెర పాకంలో ముంచుతారు. దీని రుచి తీయగా, జిగటగా ఉంటుంది. లోపల మృదువుగా ఉంటుంది. సాధారణంగా జిలేబీ వేడి వేడిగా ఫాఫ్డాతో కలిపి తింటే రుచి బాగుంటుంది. గుజరాత్‌లో దసరా పండుగ సందర్భంగా వీటిని ఎక్కువగా తింటారు. ఇది ఒక సాంస్కృతిక చిహ్నంగా మారింది.
శ్రీ జలరామ్ నమ్కీన్ - చిరాగ్ అలీ లేన్, అబిడ్స్
ఆదివారం ఉదయం మాత్రమే తాజా ఫాఫ్డాకు వేడి జిలేబీతో కలిపి వేయించిన పచ్చి మిరపకాయలు ఇస్తారు. దీని ధర దాదాపు రూ.100 ఉంటుంది. ఈ స్టాక్ త్వరగా అయిపోతుంది కాబట్టి ముందుగానే అక్కడికి చేరుకోండి. ఇక్కడ నుండి డెలివరీ ఉండదు.
పటేల్స్ డిలైట్స్ - కాచిగూడ స్టేషన్ రోడ్
పటేల్స్ డిలైట్స్ అనేది కాచిగూడ రైల్వే స్టేషన్ రోడ్ లో ఉన్న ఒక ప్రసిద్ధ రెస్టారెంట్. ఇది గుజరాతీ స్నాక్స్, స్వీట్లు, సౌత్ ఇండియన్ టిఫిన్లు, ఇతర వంటకాలకు ప్రసిద్ధి చెందింది. జిలేబీ-ఫాఫ్డా కాంబో కోసం మీరు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. ధర రూ. 90 ఉంటుంది. హైదరాబాద్ అంతటా ఆన్‌లైన్ ఆర్డర్‌కు అందుబాటులో ఉంది. సాధారణంగా ఆదివారాల్లో ఉదయం 8:30 గంటలకే తాజా స్టాక్ ప్రారంభమవుతుంది.
శ్రీజీ స్వీట్ హౌస్ – చిరాగ్ అలీ లేన్, అబిడ్స్
1991 నుండి ఆదివారాల్లో లైవ్ ఫాఫ్డా తయారీకి ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశం, చట్నీ మిరపకాయలతో రూ.120–రూ.150కి కాంబోలను అందిస్తుంది. ఆన్ లైన్ డెలివరీ లేదు, కానీ తాజాగా తయారుచేసి మీకు ఇస్తారు.
శ్రీ గుజరాతీ రాంభరోస్ స్వీట్ మార్ట్ - కోటి
శ్రీ గుజరాతీ రాంభరోస్ స్వీట్ మార్ట్ కోఠిలో ఉంది. ఇది గుజరాతీ స్వీట్లు, చిరుతిళ్లకు ప్రసిద్ధి చెందింది. జిలేబీ-ఫాఫ్డాను తాజాగా చేసి ఇస్తారు, ముఖ్యంగా ఆదివారం ఉదయం. ఈ కాంబో ధర రూ.120-రూ.150, క్రిస్పీ ఫఫ్డా, సిరప్ జిలేబీ, చట్నీలను అందిస్తారు. ఆన్ లైన్ డెలివరీ లేదు.
Also Read:
వర్షాకాలంలో ఒక్కసారైనా చూడాల్సిన అందమైన టూరిస్టు ప్రదేశాలు ఇవే..
లంచ్ చేసుకోవడానికి టైం ఉండట్లేదా.. 5 ఫాస్ట్ రెసిపీ ఐడియాస్ మీకోసమే..
For More Lifestyle News