Monsoon Fruits: ఖాళీ కడుపుతో వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ తినాల్సిన పండ్లు ఇవే..!
ABN , Publish Date - Jul 14 , 2025 | 06:58 PM
వానాకాలంలో వేగంగా వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. అందుకే ఈ సీజన్లో కచ్చితమైన ఆహార నియమాలను పాటించడం చాలా అవసరం. ముఖ్యంగా ఈ 5 పండ్లను ఖాళీ కడుపుతో తింటే రోగనిరోధకశక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారు.

Best Monsoon Fruits: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌లు మరింత చురుగ్గా మారతాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి వ్యాధులు చాలా వేగంగా సోకుతాయి. అందుకే ఈ సీజన్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వైద్యులు ఆహారపానీయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిఫార్సు చేస్తున్నారు. ముఖ్యంగా ఖాళీ కడుపుతో ఈ 5 పండ్లనూ తింటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి. ఇంతకీ, ఆ పండ్లు ఏవో.. వీటిని ఖాళీ కడుపుతో తినడం వల్ల కలిగే లాభాలేంటో చూద్దాం.
దానిమ్మ
వర్షాకాలంలో ఖాళీ కడుపుతో దానిమ్మ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. దానిమ్మలో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి మంచివి. ఇందులోని అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరచి మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీనితో పాటు దానిమ్మలో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడతాయి.
బొప్పాయి
వర్షాకాలంలో ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బొప్పాయిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ మలబద్ధకం సమస్యను పోగొడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచి శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా బొప్పాయిలోని విటమిన్ సి, ఎ, యాంటీఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి.
పియర్
ఖాళీ కడుపుతో బేరి పండ్లు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే బరువు కూడా ఈజీగా తగ్గుతారు. ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెరుగుతుంది.
రేగు పండ్లు
ఖాళీ కడుపుతో రేగు పండ్లు తినడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరిగి మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరానికి ఈ చిన్న పండు శక్తిని అందిస్తుంది. ఇందులోని ఫైబర్, సార్బిటాల్ జీర్ణక్రియకు సహాయపడతాయి. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లను శరీరానికి శక్తిని అందిస్తాయి.
నేరేడు
నేరేడు పండ్లను ఖాళీ కడుపుతో తినడం వల్ల అధిక ప్రయోజనాలు దక్కుతాయి. ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుంది. ఇది మాత్రమే కాదు. మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.
Also Read:
ఆపరేషన్ అవసరం లేదు.. ఈ 7 ఆయుర్వేద పానీయాలతో కిడ్నీలో రాళ్లకు చెక్..
రోజూ ఈ 3 సూపర్ ఫ్రూట్స్ తింటే.. రోగాలు పరార్..!
For More Health News