Salt Hacks: మీకు తెలుసా? ఉప్పుతో కలిగే 6 అద్భుత ప్రయోజనాలు!
ABN , Publish Date - Jun 01 , 2025 | 11:46 AM
Salt Hacks For Daily Life: రుచికి, ఆరోగ్యానికి ఉప్పు తప్పనిసరిగా రోజువారీ ఆహారంలో తీసుకోవాల్సిందే. అయితే ఉప్పును ఆహారంలోనే కాదు. ఇలా కూడా వాడుకోవచ్చు. ఇంటి పనులతో పాటు ఇంకా ఎన్నో అద్భుత ప్రయోజనాలున్నాయి.

Surprising Uses Of Salt: ప్రతి ఇంట్లో ఉప్పును కచ్చితంగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది ఆహారంలో అత్యంత ప్రాథమిక పదార్థం. వంటకం తయారీ కోసం ఎన్ని పదార్థాలు వేసినా ఉప్పు ఒక్కటి లేకపోయే అది తినడానికి పనికిరాని ఆహారపదార్థంగానే మిగిలిపోతుంది. అంతే కాకుండా, శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ప్రతి రోజూ పరిమిత మోతాదులో ఉప్పును తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. బీపీ భయంతో ఉప్పుకు దూరంగా ఉన్న అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు వస్తాయి. అయితే, ఉప్పును ఆహారంలో మాత్రమే కాదు. ఇతర పనులకు కూడా వాడుకోవచ్చు. అందరికీ సులువుగా అందుబాటులో ఉండే ఉప్పుతోనే క్లిష్టంగా అనిపించే రోజువారీ సమస్యలను ఇట్టే పూర్తిచేసుకోవచ్చు.
ఉప్పు ఆహార రుచిని సమతుల్యం చేయడంలో మాత్రమే కాకుండా అనేక ఇతర పనులలో కూడా మీకు సహాయపడుతుంది. ఇంటి పనులను సులభతరం చేసేందుకు ఉప్పును ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో మనం తెలుసుకుందాం.
సహజ క్లీనర్
ఉప్పును సహజ క్లీనర్‌గా ఉపయోగించవచ్చు. దీని కోసం నిమ్మరసం లేదా వెనిగర్ తీసుకొని ఉప్పుతో కలిపి పేస్ట్ తయారు చేయండి. దీనితో మీరు సింక్‌ను శుభ్రం చేయవచ్చు. అలాగే కటింగ్ బోర్డులు, కౌంటర్ టాప్స్, పాలరాయి మరకలను తొలగించడంలో కూడా ఉపయోగపడుతుంది. నల్లగా కాలిన పాత్రలను లేదా మొండి జిడ్డును శుభ్రం చేయాల్సి వచ్చినా ఈ ఉప్పు మిశ్రమాన్ని ఉపయోగిస్తే చాలు. మీ పని సులభతరం అవుతుంది.
ఇత్తడి పాత్రలు
ఇంట్లో ఉంచిన ఇత్తడి పాత్రలు కొన్నాళ్లకే నల్లగా మారుతాయి. దీనివల్ల అవి చాలా పాతవిగా కనిపిస్తాయి. వీటిని శుభ్రం చేయడానికి ఇకపై మీరు కష్టపడనక్కర్లేదు. ఉప్పు, నిమ్మకాయను కలిపి లేదా ఉప్పు, బేకింగ్ సోడాను కలిపి పాత్రలను శుభ్రం చేయవచ్చు. ఈ మిశ్రమంతో రాగి పాత్రలను శుభ్రం చేస్తే తళతళా మెరిసిపోతాయి.
ఫ్రిజ్ దుర్వాసన
కొన్నిసార్లు రిఫ్రిజిరేటర్ నుండి వింతైన వాసన వస్తుంటుంది. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే రిఫ్రిజిరేటర్లో ఉంచిన పదార్థాలు చెడిపోయే అవకాశం ఉంది. ఈ సమస్యను సాల్వ్ చేసేందుకు ఒక గిన్నెలో నిమ్మకాయ, ఉప్పు మిశ్రమాన్ని వేసి ఫ్రిజ్‌లో ఉంచండి. మీరు ఉప్పును ఒక గిన్నెలో, ఇంటి మూలల్లో, అల్మారాలు మొదలైన వాటిలో కూడా ఉంచవచ్చు.
బూట్ల వాసన
బూట్ల నుంచి వచ్చే దుర్వాసనతో చాలా ఇబ్బంది పెడుతుంది. దీని వల్ల మీరు సిగ్గుపడాల్సి రావచ్చు. దీన్ని వదిలించుకోవాలనుకున్నా ఉప్పు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బూట్ల లోపల ఉప్పు వేసి ఉదయం శుభ్రం చేసి ఆరబట్టండి. ఇది బూట్ల దుర్వాసనను తగ్గించడంలో సహాయపడుతుంది.
మూసుకుపోయిన పైపులు
చాలా ఇళ్లలో సింక్ పైపులు మూసుకుపోయి నీళ్లు సరిగా పోవు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కొన్ని చెంచాల ఉప్పు, బేకింగ్ సోడా కలిపి పైపులో పోయండి. తర్వాత మరిగించిన నీటిని పోయాలి. కొంత సమయం తర్వాత పైపులో పేరుకుపోయిన మురికి తొలగిపోవడం ప్రారంభమవుతుంది. కాసేపటికే నీరు సులభంగా పైపు ద్వారా పారడం గమనిస్తారు.
కూరగాయలు కడగడానికి ఉప్పు
మార్కెట్ నుండి తెచ్చిన కూరగాయలపై పేరుకుపోయిన మురికి, బ్యాక్టీరియా, కెమికల్స్ తొలగించడానికి వాటిని ఉప్పు నీటిలో కొంత సమయం నానబెట్టాలి. దీనితో కూరగాయలలో కీటకాలు ఉంటే తొలగిపోతాయి. మురికి కూడా శుభ్రం అవుతుంది. మీరు కూరగాయలను ఉప్పునీటి నుండి తీసివేసి తేమ ఆరిన తర్వాత నిల్వ చేస్తే వాటి షెల్ఫ్ లైఫ్ కూడా బాగానే ఉంటుంది.
Also Read:
భార్యని మనస్ఫూర్తిగా ప్రేమించే భర్త అలవాట్లు ఇవే..
ఉదయాన్నే చిరాగ్గా అనిపిస్తోందా.. ఇలా జరగడానికి కారణాలివే..
For More Lifestyle And Telugu News