Cooking Tips: ఈ కూరల్లో ఉల్లిపాయ మిక్స్ చేస్తే.. రుచి, ఆరోగ్యం రెండూ చెడిపోతాయి..
ABN , Publish Date - May 08 , 2025 | 08:11 PM
Avoid Onion With These Vegetables: ఉల్లిపాయ లేకుండా ఏ ఆహారపదార్థాన్ని ఊహించుకోలేము. దాదాపు ప్రతి వంటకానికి ఉల్లిపాయ కలుపుతాము. కానీ, ఈ 6 కూరగాయలకు ఉల్లిపాయ జోడించడం వల్ల రుచి చెడిపోవడమే కాదు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.

Vegetables Not To Mix With Onion: మన భారతీయులు ఏ వంటకాన్ని అయినా ఉల్లిపాయ వేయకుండా వండలేరు. రోజూ తయారుచేసే పప్పు, సాంబారు, కూర ఇలా ఎందులో అయినా రుచి కోసం ఆహారంలో ఉల్లిపాయ కలుపుతారు. కానీ ప్రతి కూరగాయకు ఉల్లిపాయ వాడాల్సిన అవసరం లేదు. నిజానికి, కొన్ని కూరగాయలలో ఉల్లిపాయలు జోడించడం వల్ల వాటి రుచి చెడిపోవడంతో పాటు కొన్నిసార్లు ఆరోగ్యంపై కొన్ని ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. కాబట్టి ఆ కూరగాయల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బీరకాయ
బీరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. తేలికైన ఆహారం తినాలని భావిస్తే బీరకాయ ఉత్తమమైనది. కానీ మీరు దీనితో వంట తయారుచేసేటప్పుడు ఉల్లిపాయను జోడిస్తే అది పదార్థం రుచిని నాశనం చేయడమే కాకుండా జీర్ణం కావడానికి కూడా కష్టంగా మారుతుంది. మీరు బీరకాయ నిజమైన రుచిని ఆస్వాదించాలనుకుంటే జీలకర్ర వేస్తే మంచి టేస్ట్ వస్తుంది.
పొట్లకాయ
పొట్లకాయ కూర తయారుచేసేటప్పుడు ఉల్లిపాయలు వేయకండి. నిజానికి నీటితో సమృద్ధిగా ఉండే పొట్లకాయ చాలా సులభంగా జీర్ణం అవుతుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది. మీరు దానికి ఉల్లిపాయను జోడిస్తే దాని శీతలీకరణ లక్షణాలు తగ్గుతాయి. జీర్ణం కావడానికి కూడా కొంచెం కష్టమవుతుంది.
కాల్చిన వంకాయ
కాల్చిన వంకాయ పచ్చడికి ఉల్లిపాయ కలిపితే టేస్ట్ తగ్గిపోతుంది. దీన్ని యాడ్ చేయడం వల్ల సహజమైన కాల్చిన రుచి పోయి ఉల్లిపాయ ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది. అదీగాక, ఉల్లిపాయ వేయించడం కోసం నూనెను ఉపయోగించాల్సి వస్తుంది. ఇది అనవసరమైన కేలరీలను పెంచుతుంది. వంకాయలోని యాంటీ-ఆక్సిడెంట్లను కూడా తగ్గిస్తుంది.
గుమ్మడికాయ
గుమ్మడికాయ చాలా మృదువైనది. రుచిలో కొంచెం తీపి కూడా ఉంటుంది. ఉల్లిపాయ ఘాటైన రుచి గుమ్మడి రుచికి సెట్ కాదు. మీరు గుమ్మడికాయ అసలైన రుచిని కోరుకుంటే జీలకర్ర, పచ్చిమిర్చి, మెంతులు, ఇంగువ వంటి వాటితో సరళమైన పదార్థాలను కలపండి. ఇవి గుమ్మడికాయ వంటకాన్ని రుచికరంగా మార్చుతాయి. తేలికగా జీర్ణమవుతాయి.
Read Also: Chanakya Niti: చాణక్య నీతి.. ఈ విషయాలు పతనానికి కారణమవుతాయి..
Multani Matti Face Pack Tips: వేసవిలో కాంతివంతమైన ముఖం కోసం ముల్తానీ మిట్టితో ఈ టిప్స్ ట్రై చేయండి..
Mosquito Repellents: ఇంట్లో దోమల బెడద తట్టుకోలేకపోతున్నారా.. ఈ