Lip Health: మీ పెదాలు ఈ రంగులోనే ఉన్నాయా.. ఒకవేళ ఈ 5 లక్షణాలు ఉంటే జాగ్రత్త..
ABN , Publish Date - Apr 10 , 2025 | 02:28 PM
Nutrition Tips To Healthy Lips: పెదాలు ఏ రంగులో ఉన్నాయో అన్నదాన్ని బట్టి మీరు ఆరోగ్యవంతులా.. కాదా.. అని కనుక్కునే అవకాశముందని మీకు తెలుసా.. అందుకే పెదాల్లో ఈ 5 సమస్యల్లో ఏది కనిపించినా వెంటనే అలర్ట్ అవండి. ముందుగానే తెలుసుకుని అందమైన, ఆరోగ్యకరమైన పెదాలను సొంతం చేసుకోండి.

What Your Lips Say About Your Health: శరీరంలో కళ్లు, నాలుక, చర్మం, చేతులు, కాళ్లు ఇలా వివిధ భాగాలను చూసి ఆరోగ్య స్థితిని అంచనా వేస్తుంటారు డాక్టర్లు. కానీ మీ పెదవులు కూడా ఆరోగ్యం గురించి చెప్పగలవు. వాతావరణాన్ని బట్టి మాత్రమే పెదాల సమస్యలు వస్తాయని చాలామంది భావిస్తుంటారు. నిజానికి శరీరంలో తగినన్ని పోషకాలు లేకపోవడం వల్ల.. బ్యూటీ ఉత్పత్తుల వాడకం వల్ల కూడా పెదవుల అందం దెబ్బతింటుంది. అంటే హెల్తీ లిప్స్ కోసం కేవలం బ్యూటీ ప్రొడక్ట్స్ మాత్రమే సరిపోవు. మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడమూ ముఖ్యమే. ఇంతకీ పెదవులు ఎలా ఉంటే ఏ సమస్యలు వస్తాయి.. వాటి నుంచి ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకోండి.
అధికంగా పగుళ్లు
శీతాకాలం అయినా.. వేసవి అయినా, ప్రతి సీజన్‌లో పెదవులు పగిలిపోతున్నాయా.. దీన్ని నివారించడానికి లిప్ బామ్ రాసుకునే బదులు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉన్న ఆహారాలు తీసుకోండి. ఈ ఖనిజం లోపించడం వల్లే ఎక్కువగా పెదవులు పగిలిపోతుంటాయి. కాబట్టి రోజూ వాల్‌నట్స్ తినండి.
పెదాల అంచుల్లో పగుళ్లు
చాలా మందికి పెదవుల అంచులలో పగుళ్లు ఏర్పడతాయి. కొన్నిసార్లు నొప్పితో పాటు రక్తస్రావం కూడా కనిపిస్తుంటుంది. ఈ సమస్య విటమిన్ బి2 లోపం వల్ల వస్తుంది. దీనిని తగ్గించుకోవడానికి పుట్టగొడుగులను తినండి.
పాలిపోతే ఏం చేయాలి
పెదవుల రంగు పాలిపోయినట్లుగా కనిపిస్తుంటే శరీరంలో ఐరన్ లోపించిందని అర్థం. ఈ సమస్య తగ్గించుకునేందుకు పాలకూర వంటి ఇనుము అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినడం ప్రారంభించండి.
నల్లగా మారాయా
సాధారణంగా పొగ తాగేవారి పెదాలు నల్లగా మారతాయి. ఈ అలవాటు లేకపోయినా పెదవులు నల్లగా కనిపిస్తుంటే దీనికి కారణం మెలనిన్. శరీరంలో మెలనిన్ పెరిగినప్పుడు పెదవుల బయటి భాగం నల్లగా మారడం ప్రారంభమవుతుంది. ఈ రకమైన నల్లదనాన్ని నివారించడానికి ప్రతిరోజూ ఒక జామకాయ తినండి.
తరచుగా పెదవులు ఎండిపోతే
మీ పెదవులు తరచూ పొడిబారి ఎండిపోయినట్టుగా మారుతుంటే నీరు ఎక్కువగా తాగాలి. శరీరం డీ హైడ్రేషన్‌కు గురైతే ఇలా పెదవులు పొడిబారుతాయి.
Read Also: Kitchen Knife: కిచెన్ కత్తి పదును తగ్గిందా.. ఈ సింపుల్ టిప్స్‌తో కొత్తగా మార్చేయండి..
AC Tips: AC శబ్దం చికాకు పెడుతోందా.. కారణాలు,
Dust Cleaning Tips: క్లీన్ చేసిన తర్వాతా వస్తువులపై దుమ్ము కనిపిస్తోందా.. ఈ ట్రిక్‌తో..