Summer Hacks: సమ్మర్‌లో వాటర్ ట్యాంక్ హీటెక్కుతోందా.. ఇలా చేస్తే నీళ్లు వేడెక్కవు..
ABN , Publish Date - Apr 25 , 2025 | 03:02 PM
Summer Water Tank Cooling Tips: దాదాపు ప్రతి ఇంటికి నీళ్ల ట్యాంకులు మేడపైనే ఉంటాయి. వేసవిలో సూర్యరశ్మికి ప్రతిక్షణం గురయ్యే వస్తువుల్లో ఇదీ ఒకటి. ఇంటి పైకప్పుపై ఉండటం వల్ల ట్యాంకులోని నీళ్లు రాత్రి అయినా సలసల మరిగిపోతూ ఉంటాయి. ఇలా ట్యాంకు వేడెక్కకూడదంటే ఈ టిప్స్ పాటించండి.

How To Reduce Water Tank Heat In Summer: మండే వేసవిలో ఇంట్లోనే విపరీతమైన వేడి ఉంటుంది. ఇక ఇంటి పై కప్పుపై ఉండే వాటర్ ట్యాంకును అయితే సూర్యరశ్మి నేరుగా తాకుతుంది. శరీరాన్ని కాల్చేసే వేడికిరణాలు, గాలులు నీళ్ల ట్యాంకుని తాకి అందులోని నీళ్లని మరిగించేస్తాయి. ఉదయం సూర్యుడు ఉదయించినప్పటి నుంచి క్షణక్షణానికి ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉండటం వల్ల ఇంట్లో కుళాయికి వచ్చే నీరు వాడుకోవడం ఇబ్బందిగా అనిపిస్తుంది. వాటర్ ట్యాంకులోని నీళ్లు తాకితేనే బొబ్బలెక్కేలా హీటెక్కకుండా చల్లగా ఉండాలంటే ఈ 5 టిప్స్ అనుసరిస్తే చాలు.
ఈ రంగు ట్యాంక్ కొనండి
మీరు మీ ఇంట్లో కొత్త ట్యాంక్ ఏర్పాటు చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటే వేసవిలో నలుపు రంగు ట్యాంక్‌కు బదులుగా తెలుపు లేదా లేత నీలం రంగు ట్యాంక్‌ను కొనుగోలు చేయాలి. నలుపు రంగు ట్యాంక్ సూర్యరశ్మిని ఎక్కువగా గ్రహిస్తుంది. అందుకే అందులోని నీరు నీరు త్వరగా వేడెక్కుతుంది. చాలాసేపటికి గానీ చల్లబడదు.
మట్టి పేస్ట్
మీ ఇంట్లో నల్లటి వాటర్ ట్యాంక్ ఉంటే దానికి తెల్లని పెయింట్ వేయవచ్చు. ఇది కాకుండా ట్యాంక్ చుట్టూ మట్టి పూత కూడా పూయవచ్చు. ఇలా చేస్తే సూర్యరశ్మి నేరుగా తాకినా ఎఫెక్ట్ పడదు. నీరు చల్లగా ఉంటుంది.
థర్మోకోల్ షీట్
వేసవిలో వాటర్ ట్యాంకులో నీటిని చల్లగా ఉంచడానికి థర్మోకోల్‌ను ఉపయోగించవచ్చు. నీరు వేడెక్కకుండా నిరోధించడానికి థర్మోకోల్ షీట్ సహాయపడుతుంది. ముందుగా ట్యాంక్‌పై మట్టి పూత పూసిన తర్వాత ట్యాంక్ చుట్టూ థర్మోకోల్ షీట్‌ను చుడితే మరీ మంచిది.
జనపనార సంచి
నీళ్ల ట్యాంకు హీటెక్కకూడదంటే మీరు ఈ పాత పద్ధతిని కూడా అనుసరించవచ్చు. ఇందుకోసం జనపనార సంచి ఉంటే చాలు. ముందుగా వాటర్ ట్యాంక్‌ను మందపాటి జనపనార సంచితో కప్పండి. జనపనార వేడిని అంత అనుమతించదు. ఇక అప్పుడప్పుడు సంచిని తడి చేస్తే మరింత ఫలితం ఉంటుంది. ఇది నీటిని పీల్చుకోవడం వల్ల ట్యాంక్ లోపల ఉన్న నీరు వేడెక్కిపోగా చల్లబడుతుంది కూడా.
టిన్ షీట్లు
వేసవిలో పైకప్పుపై ఉన్న నీటి ట్యాంక్‌లోని నీరు వేడెక్కకుండా ఉండటానికి దానిపై టిన్ షీట్ వేయవచ్చు. దీన్ని కప్పడం కూడా చాలా సులభం. ముందుగా మీరు టిన్ షీట్‌ను వృత్తాకారంలో కత్తిరించి ట్యాంక్‌పై కప్పాలి. అలాగే ట్యాంక్, టిన్ మధ్య ఖాళీ స్థలంలో ఇసుక లేదా గడ్డిని నింపవచ్చు. అప్పుడు ట్యాంక్‌లోని నీరు చల్లగా ఉంటుంది.
Read Also: Summer Tips: ఎండలో తిరిగి ఇంటికి రాగానే.. ఈ 4 పొరపాట్లు చేయకండి..
Favorite Color: కలర్ సైకాలజీ తెలుసా.. ఫేవరెట్ కలర్ బట్టి వ్యక్తిత్వం కనుక్కోవచ్చు..
Sleeping Tips: రాత్రి లైట్లు ఆఫ్ చేసి పడుకోవాలా.. చీకట్లో నిద్రపోతే మంచిదా..