Share News

Xi Jinping: జిన్‌పింగ్ షాకింగ్ నిర్ణయం.. ఇద్దరు టాప్ ర్యాంక్ అధికారుల తొలగింపు

ABN , Publish Date - Jun 28 , 2025 | 04:08 PM

ఇటీవల కాలంలో పలువురు అధికారులపై జిన్‌పింగ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. అవినీతి, అనుచిత ప్రవర్తన, విధేయత లోపించడం వంటి కారణాలతో పలువురు ఉన్నతాధికారులను తొలగించింది.

Xi Jinping: జిన్‌పింగ్ షాకింగ్ నిర్ణయం.. ఇద్దరు టాప్ ర్యాంక్ అధికారుల తొలగింపు

బీజింగ్: పీపుల్స్ లిబరేషన్‌ ఆర్మీ (PLA)లో అశాంతి పెరుగుతోందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇద్దరు ఉన్నత స్థాయి అధికారులపై చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ (Xi Jinping) క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. ఒక చైనా నేవీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అధికారిని, మరో సీనియర్ న్యూక్లియర్ సైంటిస్ట్‌‌ అధికారిని డిస్మిస్ చేశారు. ఇందుకు కారణం ఏమిటనేది వెంటే స్పష్టం కాలేదు. ఇటీవల కాలంలో పలువురు అధికారులపై జిన్‌పింగ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. అవినీతి, అనుచిత ప్రవర్తన, విధేయత లోపించడం వంటి కారణాలతో పలువురు ఉన్నతాధికారులను తొలగించింది. ఈ క్రమంలోనే తాజాగా ఇద్దరు అధికారుల తొలగింపు కూడా జరిగిందని భావిస్తున్నారు.


'సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్' కథనం ప్రకారం, చైనా నేవీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ లీ హాన్‌జున్ (Li Hanjun), సీనియర్ న్యూక్లియర్ సైంటిస్ట్ లియు షిపేంగ్ (Liu Shipeng)లను దేశ అత్యున్నత లెజిస్లేటివ్ బాడీ 'నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ట (ఎన్‌పీసీ) నుంచి బహిష్కరించారు. 14వ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ప్రతినిధిగా లీ హన్‌జున్‌ను 'నేవీ సర్వీస్‌మెన్ కాంగ్రెస్' తొలగించినట్టు ఎన్‌పీసీ స్టాండింగ్ కమిటీ శుక్రవారంనాడు ప్రకటించింది. మరో కీలక నిర్ణయాన్ని గాన్సు ప్రొవిన్షియల్ పీపుల్స్ కాంగ్రెస్ తీసుకుంది. డిప్యూటీ రిప్రజెంటేటివ్ పదవి నుంచి లియు షిపేంగ్‌ను తొలగిస్తున్నట్టు ప్రకటించింది.


కాగా, 60 ఏళ్ల లీ హున్‌జున్‌ నేవీ చీఫ్ ఆఫ్ స్టాప్‌ పదవికి ముందు సెంట్రల్ మిలటరీ కమిషన్ కింద పనిచేసే ట్రైనింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టమెంట్ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆఫీస్ ఆఫ్ రిఫార్మ్స్ అండ్ ఆర్గనైజేషనల్ రీస్ట్రక్చరింగ్ కార్యాలయంలో కూడా పనిచేశారు. 2014లో ఫుజియాన్ ప్రావిన్స్ నేవల్ బేస్ కమాండర్‌గా నియమితులయ్యారు. వైస్ అడ్మిరల్‌గా ప్రమోషన్ లభించింది. ఇక.. న్యూక్లియర్ సైంటిస్ట్ లియా షిపేంగ్ తొలగింపునకు కారణం ఏమిటనేది కూడా వెంటనే తెలియలేదు. చైనా సివిల్, మిలటరీ న్యూక్లియర్ రంగంలో ఆయన కీలక పదవుల్లో పనిచేశారు. చైనా నేషనల్ న్యూక్లియర్ కార్పొరేషన్ (సీఎన్ఎన్‌సీ)లో ఆయన డిప్యూటీ చీఫ్ ఇంజనీరింగ్‌గా ఉన్నారు. గాన్సు ప్రావిన్స్‌లోని 404 బేస్‌ న్యూక్లియర్ ఫెసిలిటీలో సేవలందించారు. 2023లో ప్రతిభావంతుడైన పారిశ్రామికవేత్తగా ఆయనను గాన్సు ప్రొవిన్షియల్ ప్రభుత్వం గౌరవించింది. ఈ క్రమంలో ఆయనకు జిన్‌పింగ్ ప్రభుత్వం ఉద్వాసన చెప్పడం ఆశ్చర్యకర పరిణామంగా భావిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

కెనడాపై ట్రంప్ ఆగ్రహం.. వాణిజ్య చర్చలు ముగిస్తున్నట్టు ప్రకటన

అమెరికా సుప్రీంకోర్టులో ట్రంప్‌నకు భారీ విజయం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 28 , 2025 | 04:44 PM