Share News

Benjamin Netanyahu: బందీలను విడిచిపెట్టకపోతే గాజా నరకప్రాయంగా మారుతుంది: ఇజ్రాయెల్ ప్రధాని

ABN , Publish Date - Feb 16 , 2025 | 09:29 PM

హమాస్ తన వద్ద ఉన్న బందీలను విడిచిపెట్టని పక్షంలో గాజాలో నరక ద్వారాలు తెరుస్తానని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ హెచ్చరించారు.

Benjamin Netanyahu: బందీలను విడిచిపెట్టకపోతే గాజా నరకప్రాయంగా మారుతుంది: ఇజ్రాయెల్ ప్రధాని

ఇంటర్నెట్ డెస్క్: హామస్ తన వద్ద ఉన్న ఇజ్రాయెలీలను విడిచిపెట్టకపోతే గాజాను నరకప్రాయంగా మారుస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ త్రీవ హెచ్చరిక జారీ చేశారు. జెరుసెలంలో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో సమావేశం అనంతరం బెంజమిన్ ఈ వ్యాఖ్యలు చేశారు (Israel).

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హమాస్ చేతిలో బందీలుగా ఉన్న ముగ్గురు ఇజ్రాయెలీల స్వేచ్ఛకు సహకరించిన డొనాల్డ్ ట్రంప్‌కు బెంజమిన్ ధన్యవాదాలు తెలిపారు. అమెరికాతో ఇజ్రాయెల్ పూర్తి సమన్వయంతో పని చేస్తోందని అన్నారు.


Musk DOGE Budget Cut: భారత్‌కు అమెరికా ఇచ్చే నిధుల్లో ఎలాన్ మస్క్ కోత

‘‘మా రెండు దేశాలు ఉమ్మడి వ్యూహన్ని అనుసరిస్తున్నాము. అయితే, ఈ వివరాలను బహిరంగంగా వెల్లడించలేము. హమాస్ తన వద్ద ఉన్న బందీలందరినీ విడిచిపెట్టకపోతే గాజాను నరకప్రాయం చేస్తాము’’ అని హెచ్చరించారు. హమాస్ మిలిటరీ సామర్థ్యాన్ని తుడిచిపెట్టేస్తామని అన్నారు. గాజాలో హమాస్ పాలన లేకుండా చేస్తామని పేర్కొన్నారు. ఇక ఇరాన్ గురించి కూడా అమెరికా విదేశాంగ శాఖ మంత్రితో చర్చించినట్టు తెలిపారు.


Donald Trump: ఉద్యోగ యంత్రాంగంలో ఊచకోతలే!

‘‘అమెరికా సాయంతో ఇజ్రాయెల్ గత 16 నెలల్లో ఇరాన్‌ ఉగ్రవాదాన్ని దెబ్బతీశాము. ఇక ట్రంప్ సాయంతో ఈ పని పూర్తి చేస్తామన్న నమ్మకం నాకుంది’’ అని బెంజమిన్ అన్నారు. ఇరాన్ చేతికి అణ్వాయుధాలు ఎప్పటికీ అందకూడదని అమెరికా మంత్రి మార్కో రూబియో అన్నారు. మధ్యప్రాచ్యంలో అస్థిరతకు ప్రధాన కారణం ఇరాన్ అని మండిపడ్డారు. ఇరాన్ చేతికి అణ్వాయుధాలు అందితే ఇక ఆ దేశం లొంగదని హెచ్చరించారు. హమాస్‌ను తుదముట్టించాల్సిందేనని స్పష్టం చేశారు.

Zelensky: ఐరోపాకు అమెరికా అండగా నిలిచే రోజులు పోయాయి: ఉక్రెయిన్ అధ్యక్షుడు

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 16 , 2025 | 09:38 PM