Visa Rejected: వీసా ఇంటర్వ్యూలో నిజాలు చెబితే ఇంతేనేమో
ABN , Publish Date - Apr 17 , 2025 | 02:32 PM
Visa Rejected: అమెరికా పర్యటనకు వెళ్లాలనుకున్న ఓ భారతీయుడికి యూఎస్ ఎంబసీ వద్ద షాకింగ్ ఘటనే ఎదురైంది. వీసా ఇంటర్వ్యూలో వారు అడిగిన మూడు ప్రశ్నలకు ఆ వ్యక్తి సమాధానం ఇచ్చాడు. కానీ

అమెరికాకు వెళ్లాలని ఎవరికి ఉండదు చెప్పండి. అవకాశం ఉంటే అక్కడికి ఎగిరిపోడానికి చూస్తుంటారు యువత. కొందరు చదువులనిమిత్తం, ఉద్యోగాల కోసం వెళ్తాంటారు. అయితే కొందరు అమెరికాలో పర్యటించాలనే కోరికతో అక్కడకు వెళ్లాలని అనుకుంటారు. ఎలా వెళ్లాలని అనుకున్నా వీసా ఇంటర్వ్యూకు అటెండ్ కాక తప్పదు. ఆ ఇంటర్వ్యూలో పాస్ అయితే అమెరికాకు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. అదే విధంగా ఓ వ్యక్తి కూడా అమెరికా పర్యటనకు వెళ్లాలని వీసా కోసం అప్లై చేసుకున్నాడు. వీసా ఇంటర్వ్యూ కోసం యూఎస్ ఎంబసీకి వెళ్లాడు. కానీ.. అక్కడి వాళ్లు అడిగిన ప్రశ్నలకు.. సదరు వ్యక్తి టకాటకా సమాధానాలు చెప్పారు. ఆ తరువాత క్షణాల్లోనే అతడి వీసా రిజక్ట్ అయినట్లు వారు తెలిపారు. ఈ క్రమంలో వీసా ఇంటర్వ్యూలో ఆ వ్యక్తికి ఎదురైన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఇప్పుడు అది కాస్తా వైరల్‌గా మారింది.
వీసా ఇంటర్వ్యూలో వాళ్లు ఏం అడిగారు.. తాను ఎలాంటి సమాధానాలు చెప్పాను అనే విషయాన్ని రెడిట్‌లో ‘nobody01810’ అనే పేరుతో ఉన్న ఓ యూజర్ పోస్టు చేశారు. బీ1బీ2 వీసా ఇంటర్వ్యూ కోసం యూఎస్ ఎంబసీకి వెళ్లానని.. అక్కడ వారు తనను మూడు ప్రశ్నలు అడిగినట్లు తెలిపారు. దానికి సమధానం చెప్పగా కేవలం నిమిషం లోపే తన వీసా రిజెక్ట్ అయినట్లు తెలిపారు. వారు అడిగిన మూడు ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పానని అయినా కూడా తన వీసా తిరస్కరణకు గురైదంటూ యూజర్ తెలిపారు.
ప్రశ్నలు ఇవే
వీసా ఇంటర్వ్యూలో అమెరికాకు ఎందుకు వెళ్లాలని అనుకుంటున్నారు. అమెరికాలో మీకు బంధువులు ఎవరైనా ఉన్నారా. భారత్ దాటి ఎక్కడికైనా వెళ్లారా.. ఎప్పుడైనా పర్యటించారా అని మూడు ప్రశ్నలు అడిగారని యూజర్ తెలిపారు. వీటికి అతడు ఎలాంటి సమాధానాలు చెప్పాడో కూడా రాసుకొచ్చాడు. అంతా కూడా నిజాయితీగా చెప్పినట్లు తెలిపారు. రెండు వారాల పాటు వెకేషన్ కోసం ఫ్లోరిడా వెళ్లాలని అనుకుంటున్నానని, ఫ్లోరిడాలో తనకు గర్ల్ ఫ్రెండ్ ఉందని, ఇండియా దాటి ఎక్కడికీ వెళ్లలేదని సమాధానం ఇచ్చినట్లు చెప్పారు. అయితే తన సమాధానాలు విన్న తర్వాత కేవలం 40 సెకన్‌లలోనే ఈ వీసాకు అర్హుడిని కానంటూ తన చేతిలో స్లిప్ పెట్టారని యూజర్ చెప్పుకొచ్చాడు.
అయితే పర్యటన కోసమే తాను అమెరికా వెళ్లాలని అనుకున్నానని, రెండు వారాలు పర్యటించి తిరిగి భారత్ వచ్చేయాలని అనుకున్నానని చెప్పాడు. గర్ల ఫ్రెండ్ అనేది ఆప్షన్ మాత్రమే అని రాసుకొచ్చాడు. కానీ తన వీసాను ఎందుకు రిజెక్ట్ చేశారో కారణం తెలియట్లేదని సదరు యూజర్ పోస్టు పెట్టారు. ఈ పోస్టును చూసి నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. గర్ల ఫ్రెండ్ గురించి చెప్పకుండా ఉంటే బాగుండేదని కొందరు పెడితే. గర్ల్ ఫ్రెండ్‌తో అక్కడే అక్రమంగా సెటిల్ అయిపోతావని వారు భయపడినట్లున్నారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు.
ఇవి కూడా చదవండి
Tirupati Hostel Incident: విద్యార్థినిల గదిలోకి ప్రిన్సిపాల్.. తిరుపతిలో దారుణం
Raj Tarun Parents: హైడ్రామాకు తెర.. ఇంట్లోకి వెళ్లిన రాజ్‌తరుణ్ పేరెంట్స్
Read Latest Internationl News And Telugu News