Share News

South China Sea Crash: దక్షిణ చైనా సముద్రంలో కూలిన అమెరికా నావికా విమానం, హెలికాఫ్టర్

ABN , Publish Date - Oct 27 , 2025 | 08:09 AM

దక్షిణ చైనా సముద్రంలో అమెరికా నావికాదళానికి చెందిన రెండు వైమానిక వాహనాలు గంటల వ్యవధిలో కుప్పకూలిపోయాయి. ఈ వరుస ప్రమాదాలు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. మొదటగా హెలీకాఫ్టర్, తర్వాత నావికా విమానం..

South China Sea Crash: దక్షిణ చైనా సముద్రంలో కూలిన అమెరికా నావికా విమానం, హెలికాఫ్టర్
South China Sea crash

ఇంటర్నెట్ డెస్క్: దక్షిణ చైనా సముద్రంలో అమెరికా నావికాదళానికి చెందిన రెండు వైమానిక వాహనాలు గంటల వ్యవధిలో కుప్పకూలిపోయాయి. ఈ వరుస ప్రమాదాలు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. అక్టోబర్ 26, 2025 సాయంత్రం 2:45 గంటలకు మొదటగా MH-60R సీహాక్ హెలికాప్టర్ దక్షిణ చైనా సముద్రంలో కూలిపోయింది. తర్వాత గం. 3:15కు F/A-18F సూపర్ హార్నెట్ ఫైటర్ జెట్ సముద్రంలో కుప్పకూలింది.

Crash.jpg


ప్రమాదానికి గురైన, నావికా విమానం, హెలీకాప్టర్ రెండూ USS నిమిట్జ్ షిప్ నుండి ఆపరేట్ చేస్తున్నవి కావడం విశేషం. ఇవి 'బ్యాటిల్ క్యాట్స్' (HSM-73), 'ఫైటింగ్ రెడ్‌కాక్స్' (VFA-22) స్క్వాడ్రన్‌లకు చెందినవి. అయితే, ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ఉన్న ముగ్గురు సిబ్బంది, ఫైటర్ జెట్‌లో ఉన్న ఇద్దరు పైలట్లను సురక్షితంగా కాపాడగలిగారు.

Crash-2.jpg


పైలట్లు సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారని, సాధారణ ఆపరేషన్ల సమయంలో జరిగిన ఈ ఘటనలపై విచారణ జరుగుతోందని అమెరికా పసిఫిక్ ఫ్లీట్ అధికారులు ప్రకటించారు. అయితే, ప్రమాదాలకు కారణాలు ఇంకా తెలియరాలేదు. దక్షిణ చైనా సముద్రం.. చైనా, ఇతర దేశాల మధ్య వివాదాలకు కారణమైన ప్రాంతం. అమెరికా ఇక్కడ స్వేచ్ఛా వాతావరణాన్ని కల్పించేందుకు ఆపరేషన్లు నిర్వహిస్తోంది.


ఇవీ చదవండి:

నవంబరు 1 నుంచి బ్యాంకుల్లో వచ్చే మార్పులివే..

హైదరాబాద్‌ యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ తయారీ హబ్‌

కర్నూలు బస్సు ప్రమాదం.. బ్లూ మీడియాపై ప్రభుత్వం సీరియస్

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 27 , 2025 | 08:15 AM