Share News

Nuclear Submarine: రష్యా సమీపంలోకి అమెరికా అణు జలంతర్గాములు

ABN , Publish Date - Aug 02 , 2025 | 05:48 AM

తనను ఉద్దేశించి వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన రష్యా మాజీ అధ్యక్షుడు, ఆ దేశ భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్‌ దిమిత్రి

Nuclear Submarine: రష్యా సమీపంలోకి అమెరికా అణు జలంతర్గాములు

వాషింగ్టన్‌, ఆగస్టు 1: తనను ఉద్దేశించి వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన రష్యా మాజీ అధ్యక్షుడు, ఆ దేశ భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్‌ దిమిత్రి మెద్వెదేవ్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీవ్రంగా విరుచుకుపడ్డారు. మెద్వెదేవ్‌ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, రెండు అణు జలంతర్గాములను రష్యాకు సమీపంలో మోహరించాలని తమ సైనికాధికారులను ఆదేశించానని శుక్రవారం ప్రకటించారు. భారత్‌, రష్యాలను పతన ఆర్థిక వ్యవస్థ (డెడ్‌ ఎకానమీ)లు అంటూ అభివర్ణించిన ట్రంప్‌ను వ్యంగ్యంగా విమర్శిస్తూ.. ‘‘ట్రంప్‌కు ఇష్టమైన వాకింగ్‌ డెడ్‌ వంటి రక్త పిశాచి సినిమాలు ఆయనను వెంటాడుతున్నట్టున్నాయి’ అని మెద్వెదేవ్‌ గురువారం పేర్కొన్నారు. ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి ఆటోమేటిక్‌ అణ్వస్త్ర దాడి వ్యవస్థ ‘డెడ్‌ హ్యాండ్‌’ను గుర్తు తెచ్చుకోవాలంటూ.. పరోక్షంగా అణుదాడికీ సిద్ధమే అన్నట్టు హెచ్చరించారు.

Updated Date - Aug 02 , 2025 | 05:48 AM