Share News

India Mobile Speed Ranking: మొబైల్‌ ఇంటర్నెట్‌ వేగంలో యూఏఈదే అగ్రస్థానం

ABN , Publish Date - Jul 21 , 2025 | 04:38 AM

మొబైల్‌ ఇంటర్నెట్‌ వేగంలో యూఏఈ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. సగటున సెకనుకు 546.14

India Mobile Speed Ranking: మొబైల్‌ ఇంటర్నెట్‌ వేగంలో యూఏఈదే అగ్రస్థానం
India Mobile Speed Ranking

  • టాప్‌-10లో లేని జపాన్‌.. 26వ స్థానంలో భారత్‌

న్యూఢిల్లీ, జూలై 20: మొబైల్‌ ఇంటర్నెట్‌ వేగంలో యూఏఈ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. సగటున సెకనుకు 546.14 మెగాబిట్స్‌ (ఎంబీపీఎస్‌) వేగంతో ఇతర దేశాలను తలదన్ని అగ్రస్థానం సాధించింది. ‘హోం బ్రాడ్‌బ్యాండ్‌’ స్పీడ్‌లో సింగపూర్‌ 393.15 ఎంబీపీఎ్‌సతో తొలి స్థానం చేజిక్కించుకుంది. గత ఏడాది జూన్‌ నుంచి ఈ ఏడాది జూన్‌ మధ్య కాలంలోని డాటా ఆధారంగా ‘స్పీడ్‌ టెస్ట్‌’ వెబ్‌సైట్‌ ఈ ర్యాంకులను ప్రకటించింది. ఇటీవల సెకనుకు 1.02 పెటాబిట్స్‌తో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ను అభివృద్ధి చేసి వార్తలకెక్కిన జపాన్‌.. ఈ రెండు విభాగాల్లోనూ టాప్‌ టెన్‌ జాబితాలో కూడా లేకపోవడం గమనార్హం. అత్యాధునిక ఫైబర్‌ ఆప్టిక్‌ పరిజ్ఞానంతో తాము సాధించిన ఈ ఇంటర్నెట్‌ వేగానికి నెట్‌ఫ్లిక్స్‌ వీడియాలు అన్నింటినీ రెప్పపాటులో డౌన్‌లోడ్‌ చేయగల సామర్థ్యం ఉందని జపాన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్‌ మొబైల్‌ ఇంటర్నెట్‌ వేగంలో 133.51 ఎంబీపీఎస్‌తో 26వ స్థానంలో, బ్రాడ్‌బ్యాండ్‌లో 59.51 ఎంబీపీఎ్‌సతో 98వ స్థానంలో నిలిచింది.

ఈ వార్తలు కూడా చదవండి..

రండి.. ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించుకుందాం: మంత్రి లోకేష్ పిలుపు

ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చిస్తాం: కిరణ్ రిజిజు

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 21 , 2025 | 04:38 AM