Share News

Patriot Missiles: ఉక్రెయిన్, రష్యా యుద్ధం.. ట్రంప్ కీలక నిర్ణయం..

ABN , Publish Date - Jul 14 , 2025 | 11:00 AM

Patriot Missiles: పుతిన్ తన మాటలు లెక్కచేయకపోవటంతో ట్రంప్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌కు పాట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని పంపుతున్నారు. ఆదివారం ఇందుకు సంబంధించి ఓ కీలక ప్రకటన చేశారు.

Patriot Missiles: ఉక్రెయిన్, రష్యా యుద్ధం.. ట్రంప్ కీలక నిర్ణయం..
Patriot Missiles

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ విషయంలో రష్యా తీరును తప్పుబడుతున్న సంగతి తెలిసిందే. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌‌పై గత కొంతకాలంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. పుతిన్ తనతో ఫోన్‌లో ఎంతో చక్కగా మాట్లాడతాడని, తర్వాత అందరిపై బాంబులు వేస్తాడని ట్రంప్ మండిపడుతున్నారు. పుతిన్ తన మాటలు లెక్కచేయకపోవటంతో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌కు పాట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని పంపుతున్నారు. ఆదివారం ఇందుకు సంబంధించి ఓ కీలక ప్రకటన చేశారు.


మీడియా ప్రతినిధులతో ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఉక్రెయిన్‌కు పాట్రియాట్స్ పంపుతున్నాము. అవి వారికి ఎంతో అవసరం. ఎన్ని మిస్సైల్స్ పంపాలన్నదానిపై ఒప్పందం జరగలేదు. వాళ్లకు కూడా రక్షణ కావాలి కాబట్టి.. కొన్ని మిస్సైల్స్ పంపుతున్నాం. మేము పంపే వాటికి వాళ్లు కచ్చితంగా డబ్బులు చెల్లిస్తారు. అది మాకు ఓ వ్యాపారంగా మారతుంది. పుతిన్ చాలా మంది ప్రజల్ని ఆశ్చర్యపరిచారు. ఆయన ఉదయం చాలా చక్కగా మాట్లాడతాడు. సాయంత్రం అయ్యే సరికి అందరి మీదా బాంబులు వేస్తాడు’ అని అన్నారు.


వెనక్కు తగ్గిన ఇరాన్

అమెరికా దెబ్బకు ఇరాన్ వెనక్కు తగ్గింది. మళ్లీ పాత దోస్తీ కొనసాగించడానికి చూస్తోంది. అమెరికా తమపై యుద్ధానికి దిగదని హామీ ఇస్తే.. న్యూక్లియర్ ఒప్పందాన్ని కొనసాగిస్తామని తేల్చిచెప్పింది. 1960లలో ఇరాన్, అమెరికా ఎంతో అన్యోన్యంగా ఉండేవి. అమెరికా న్యూక్లియర్ బాంబు తయారీకి అవసరమైన యురేనియంను ఇరాన్‌కు సరఫరా చేసేది. అయితే, ఆయతుల్లా ఖమేనీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు దేశాలు శత్రువుల్లా మారిపోయాయి.


ఇవి కూడా చదవండి

సీనియర్ నటి బీ సరోజా దేవి కన్నుమూత

భార్యను చంపి సమాధిపై కూరగాయలు నాటాడు.. 9 నెలల తర్వాత..

Updated Date - Jul 14 , 2025 | 01:53 PM