Share News

Trump-Mamdani: మందానీ దెబ్బకు రగిలిపోతోన్న ట్రంప్.. న్యూయార్కర్లు పారిపోక తప్పదంటూ కామెంట్

ABN , Publish Date - Nov 06 , 2025 | 10:56 AM

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కోపంతో రగిలిపోతున్నారు. న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో డెమోక్రాటిక్ సోషలిస్ట్ అభ్యర్థి, భారత మూలాలున్న జోహ్రాన్ మందానీ విజయం సాధించడంపై ట్రంప్ తీవ్ర అసహనం

Trump-Mamdani: మందానీ దెబ్బకు రగిలిపోతోన్న ట్రంప్.. న్యూయార్కర్లు పారిపోక తప్పదంటూ కామెంట్
Donald Trump, Zohran Mamdani

Trump-New Yorkers: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కోపంతో రగిలిపోతున్నారు. న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో డెమోక్రాటిక్ సోషలిస్ట్ అభ్యర్థి, భారత మూలాలున్న జోహ్రాన్ మందానీ విజయం సాధించడంపై ట్రంప్ తీవ్ర అసహనం వెళ్లగక్కుతున్నారు. మందానీ పాలనలో న్యూయార్క్ నగరం కమ్యూనిస్ట్ క్యూబా లేదా సోషలిస్ట్ వెనిజులాగా మారుతుందని ట్రంప్ అంటున్నారు.


మియామిలోని అమెరికా బిజినెస్ ఫోరమ్‌లో ట్రంప్ మాట్లాడుతూ.. 'దీంతో న్యూయార్కర్లు ఫ్లోరిడాకు పారిపోక తప్పదు'అని హెచ్చరించారు. కమ్యూనిజాన్ని చూసి న్యూయార్క్ నగరం నుంచి పారిపోతున్న వారికి మయామి త్వరలో శరణార్థి శిబిరం అవుతుందని ట్రంప్ చెప్పుకొచ్చారు.


అంతేకాదు, మందానీని ఒక కమ్యూనిస్ట్ గా అభివర్ణించిన ట్రంప్.. ఈ విజయం తర్వాత అమెరికా కొద్దిగా సార్వభౌమాధికారాన్ని కోల్పోయిందన్నారు. ధనికులపై పన్నులు పెంచి, ఆ నిధులతో ప్రభుత్వ కార్యక్రమాలకు నిధులు సమకూరుస్తానని 34 ఏళ్ల మందానీ వాగ్దానం చేయడంతో న్యూయార్క్ మేయర్ రేసులో విజయం సాధించారని ట్రంప్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

Nara Lokesh: ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి ఆదేశాలు

Agriculture Minister: పరిహారమిచ్చినా ధాన్యం కొంటాం

Updated Date - Nov 06 , 2025 | 11:46 AM