Donald Trump: జోహ్రాన్ గెలిస్తే న్యూయార్క్‌కు కష్టాలే!
ABN , Publish Date - Jul 01 , 2025 | 05:40 AM
న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న డెమోక్రాట్ పార్టీ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.

నగరానికి అందించే నిధుల్లో కోత వేస్తాం: ట్రంప్
వాషింగ్టన్, జూన్ 30: న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న డెమోక్రాట్ పార్టీ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. డెమోక్రటిక్ సోషలిస్ట్ అయిన జోహ్రాన్ ప్రవర్తన సరిగా ఉండదని, నవంబరు 4న జరగనున్న ఎన్నికల్లో ఆయన గెలిస్తే న్యూయార్క్ నగరానికి అందించే ప్రభుత్వ నిధుల్లో కోత వేస్తామని బెదిరించారు. జోహ్రాన్ పక్కా కమ్యూనిస్టు అభ్యర్థి అని ట్రంప్ పేర్కొన్నారు.
జోహ్రాన్ గెలిస్తే న్యూయార్క్ నగరానికి అంత మంచిది కాదని ట్రంప్ స్పష్టం చేశారు. న్యూయార్క్ మేయర్‌గా ఎవరు గెలిచినా మర్యాదగా ప్రవర్తించాల్సిందేనని తేల్చిచెప్పారు. నగర కంపో్ట్రలర్ సమాచారం ప్రకారం న్యూయార్క్‌కు సమాఖ్య ప్రభుత్వం నుంచి 100 బిలియన్ డాలర్లకు పైగా నిధులు అందుతున్నాయి. కాగా, ట్రంప్ వ్యాఖ్యలపై భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ స్పందించారు. తాను కమ్యూనిస్టును కాదని చెప్పారు.