Share News

EU-US Trade Deal: యూరోపియన్ యూనియన్‌తో భారీ వాణిజ్య ఒప్పందం.. డొనాల్డ్ ట్రంప్ ప్రకటన

ABN , Publish Date - Jul 28 , 2025 | 09:47 AM

ఈయూతో భారీ వాణిజ్య ఒప్పందం కుదిరిందని ట్రంప్ తాజాగా ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రకారం, ఈయూ ఉత్పత్తులపై కనీసం 15 శాతం సుంకం విధిస్తామని అన్నారు. ట్రంప్‌తో ఈయూ ప్రెసిడెంట్ చర్చల్లో పాల్గొన్నారు. ఈ ఒప్పందంపై హర్షం వ్యక్తం చేశారు.

EU-US Trade Deal: యూరోపియన్ యూనియన్‌తో భారీ వాణిజ్య ఒప్పందం.. డొనాల్డ్ ట్రంప్ ప్రకటన
Trump EU Trade Deal

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య ఎట్టకేలకు వాణిజ్య ఒప్పందం కుదిరింది. తమ మధ్య భారీ ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం ప్రకటించారు. స్కాట్‌లాండ్‌లోని తన గోల్ఫ్ రిసార్ట్‌లో ఈయూ ప్రెసిడెంట్ అర్సులా వాన్ డెర్ లెయన్‌తో చర్చల అనంతరం ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా ఈయూ అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై కనీస సుంకాన్ని 15 శాతంగా నిర్ణయించామని తెలిపారు

అమెరికా, ఈయూ దేశాల మధ్య ఒప్పందం కుదరడంతో వాణిజ్య యుద్ధ భయాలు తొలగిపోయాయి. ఆగస్టు 1 తరువాత ఈయూ ఉత్పత్తులపై 30 శాతం కనీస సుంకాన్ని విధించేందుకు గతంలో అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. వాణిజ్య ఒప్పందం కుదరడంతో ఈయూ దేశాలకు భారీ ఊరట దక్కింది.

ఇది గతంలో ఎన్నడూ చూడని భారీ వాణిజ్య ఒప్పందమని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈయూ ఆటోమొబైల్, ఫార్మాసిటికల్ రంగాలు సహా అన్నిటి పైనా 15 శాతం సుంకం ఉంటుందని తెలిపారు. అమెరికా నుంచి 750 బిలియన్ డాలర్ల విలువైన ఇంధనాలను కూడా కొనుగోలు చేసేందుకు ఈయూ అంగీకరించిందని అన్నారు. అమెరికాలో మరో 600 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు ఈయూ సంసిద్ధత వ్యక్తం చేసిందని తెలిపారు. అమెరికా మిలిటరీ ఉత్పత్తుల కొనుగోలు కూడా ఈయూ అంగీకరించిందని అన్నారు.


27 సభ్య దేశాలున్న ఈయూ తరపున చర్చల్లో పాల్గొన్న ప్రెసిడెంట్ అర్సులా.. అమెరికాతో ఒప్పందంపై హర్షం వ్యక్తం చేశారు. అమెరికా నుంచి ఎల్ఎన్‌జీ, చమురు, అణు ఇంధనాన్ని కొనుగోలు చేస్తామని అన్నారు. రాబోయే మూడేళ్లల్లో ఈ కొనుగోళ్లు ఉంటాయని చెప్పారు. రష్యా ఇంధనాల నుంచి ఇతర వనరులపై మళ్లే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

ఇది తమకు ఆమోదయోగ్యమైన ఒప్పందం అని మీడియాతో వ్యాఖ్యానించారు. స్థిరత్వం నెలకొంటుందని, ఇరు దేశాల్లోని వ్యాపారాలకు ఇది అవసరమని అభిప్రాయపడ్డారు. విమానాలు, కొన్ని రకాల రసాయనాలు, వ్యవసాయ ఉత్పత్తులు, ఇతర క్రిటికల్ ముడి సరుకులపై ద్వైపాక్షిక పన్ను రాయితీలకు కూడా అంగీకారం కుదిరినట్టు తెలిపారు. ప్రస్తుతం అమెరికా, ఈయూ మధ్య దాదాపు 1.6 ట్రిలియన్ డాలర్ల వాణిజ్యం ఉంది.


ఇవి కూడా చదవండి:

గాజాపై దాడులకు విరామం.. ఇజ్రాయెల్ కీలక నిర్ణయం

వలసలపై ట్రంప్ హెచ్చరికలు.. ఈ ఆక్రమణను అడ్డుకోవాలని ఐరోపా దేశాలకు పిలుపు

మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 28 , 2025 | 10:31 AM