Trump On America Party: మస్క్ కొత్త పార్టీపై ట్రంప్ విమర్శలు.. అది అయ్యేది కాదంటూ..
ABN , Publish Date - Jul 07 , 2025 | 07:22 AM
Trump On America Party: డొనాల్డ్ ట్రంప్, ఎలన్ మస్క్ కొన్ని నెలల క్రితం వరకు బెస్ట్ ఫ్రెండ్స్‌లాగా ఉండేవారు. ఎన్నికల సమయంలో ట్రంప్ కోసం మస్క్ చాలా కష్టపడ్డాడు. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ తన బుద్ధి చూపించారు.

ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కొత్త పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అమెరికా పార్టీని ప్రారంభిస్తున్నట్లు ఆదివారం తన ఎక్స్ ఖాతా వేదికగా ప్రకటన చేశారు. ‘మన దేశాన్ని నష్టాలలోకి నెట్టే వృధా ఖర్చులు, అవినీతి — ఇవన్నీ చూస్తుంటే.. మనం ప్రజాస్వామ్యంలో కాకుండా ఒక పార్టీ పాలనలో ఉన్నట్టు ఉంటుంది. మీ స్వేచ్ఛను మళ్లీ మీకు అందించడానికి ఈ రోజు అమెరికా పార్టీ ఏర్పడింది. ఇదే మీకు కావలసిన కొత్త రాజకీయ పార్టీ’ అని పేర్కొన్నారు.
మస్క్ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించటంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. మస్క్ కొత్త పార్టీ మొదలుపెట్టడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. మస్క్ దారుణమైన పరిస్థితిలో ఉన్నాడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ట్రంప్ మూడో పార్టీ మొదలుపెట్టడం హాస్యాస్పదంగా అనిపిస్తోంది. అమెరికా రెండు పార్టీలకు సంబంధించిన వ్యవస్థ. మూడో పార్టీ మొదలుపెట్టడం అంటే.. ప్రజల్ని తికమక పెట్టడమే. మూడో పార్టీ ఇక్కడ పని చేయదు’అని అన్నారు.
బిల్లు తెంచిన తంటా..
డొనాల్డ్ ట్రంప్, ఎలన్ మస్క్ కొన్ని నెలల క్రితం వరకు బెస్ట్ ఫ్రెండ్స్‌లాగా ఉండేవారు. ఎన్నికల సమయంలో ట్రంప్ కోసం మస్క్ చాలా కష్టపడ్డాడు. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ తన బుద్ధి చూపించారు. అన్ని వర్గాలకు.. మరీ ముఖ్యంగా వలసదారులను ఇబ్బందిపెట్టే ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ను తెచ్చారు. ఈ బిల్లు కారణంగా మస్క్ కూడా చాలా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే దాన్ని వ్యతిరేకించాడు. అడ్డుకోవాలని విశ్వప్రయత్నం చేశాడు. బిల్లు అమలైతే కొత్త పార్టీ మొదలుపెడతానని మస్క్ చెప్పాడు. నెలరోజుల క్రితమే అమెరికా పార్టీ పేరు ప్రకటించాడు. మస్క్ ఎంత అడ్డుపడ్డా.. ట్రంప్ వెనక్కు తగ్గలేదు. బిల్లును అమల్లోకి తెచ్చాడు.
ఇవి కూడా చదవండి
కోర్ బ్రాంచెస్‌లో కీలకం మెకానికల్ ఇంజనీరింగ్