Share News

Trump Administration: అమెరికా విదేశాంగ శాఖలో 1,353 మంది ఉద్యోగుల తొలగింపు

ABN , Publish Date - Jul 12 , 2025 | 06:02 AM

అమెరికాలో విభాగాల పునర్వవ్యస్థీకరణపై ట్రంప్‌ సర్కారు తను ప్రయత్నాలను కొనసాగిస్తోంది. అందులో భాగంగా విదేశాం గ శాఖలో 1,353 మంది ఉద్యోగులను తొలగించాలని శుక్రవారం నిర్ణయించింది.

Trump Administration: అమెరికా విదేశాంగ శాఖలో 1,353 మంది ఉద్యోగుల తొలగింపు

వాషింగ్టన్‌, జూలై 11: అమెరికాలో విభాగాల పునర్వవ్యస్థీకరణపై ట్రంప్‌ సర్కారు తను ప్రయత్నాలను కొనసాగిస్తోంది. అందులో భాగంగా విదేశాం గ శాఖలో 1,353 మంది ఉద్యోగులను తొలగించాలని శుక్రవారం నిర్ణయించింది. వీరిలో అమెరికాలో పనిచేసే 1,107 మంది సివిల్‌ సర్వెంట్లు, 246 మంది ఫారెన్‌ సర్వీసు అధికారులు ఉన్నారు. తొలగింపునకు గురయ్యే ఉద్యోగులకు వ్యక్తిగతంగా ఈ-మెయిల్‌ ద్వారా నోటీసులు పంపించారు.


తొలుత తక్షణమే 120 రోజుల పాటు అడ్మినిస్ట్రేటివ్‌ లీవ్‌పై వెళ్లాలని సూచించారు. ఆ సెలవు ముగిసిన అనంతరం వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తారు. చాలా మంది సివిల్‌ సర్వెంట్లకు ఈ సెలవు కాలం కేవలం 60 రోజులు కావడం గమనార్హం. ఉద్యోగులను తగ్గించడం కారణంగా సవాళ్లను ఎదుర్కోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయని పలువురు దౌత్యవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Jul 12 , 2025 | 06:02 AM