Trudeau Gets Emotional: పత్రికా సమావేశంలో ట్రూడో కన్నీరు.. ట్రంప్ పాలనను గుర్తు చేసుకున్న వైనం
ABN , Publish Date - Mar 07 , 2025 | 02:03 PM
పత్రికా సమావేశంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన పదేళ్ల పాలనలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానన్న ఆయన కెనేడియన్ల ప్రయోజనాలకే తాను ఎల్లప్పుడూ పెద్ద పీట వేశానని

ఇంటర్నెట్ డెస్క్: మరో రెండు రోజుల్లో తన పదవికి రాజీనామా చేయనున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తాజాగా మీడియా సమావేశంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. గత 10 పదేళ్ల కాలంలో పాలనా పరంగా ఎదురైన సవాళ్లను గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. కెనేడియన్ల ప్రయోజనాలకే తాను ఎల్లప్పుడూ పెద్ద పీట వేశానన్నారు. మార్చి 9న ట్రూడో తన పదవి నుంచి, పార్టీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. అదే రోజు పార్టీ మరొకరిని ఎన్నుకోనుంది. తాను తప్పుకోనున్నట్టు ట్రూడో జనవరిలో ప్రకటించారు (Trudeau Gets Emotional).
పరిపానలో సవాళ్లు, ట్రంప్ సుంకాల బెదిరింపుల గురించి ఆయన తన చివరి మీడియా సమావేశంలో మాట్లాడుతూ భావోద్వేగాలను అణుచుకోలేక పోయారు. ‘‘ఆఫీసుకు వచ్చిన ప్రతిసారీ నేను కెనేడియన్ల ప్రయోజనాలకే తొలి ప్రధాన్యం ఇస్తూ విధులు నిర్వర్తించాను. కెనేడియన్ల కోసం మేము ఉన్నాము. మా ప్రభుత్వం త్వరలో తప్పుకోనున్నా మేము కెనేడియన్ల ప్రయోజనాల కోసమే చివరికంటా పనిచేస్తాము’’ అని అన్నారు.
Tariffs on Canada: మెక్సికో తరువాత కెనడాకు ఊరట.. ట్రంప్ సుంకాల విధింపు వాయిదా
కాగా, సుంకాల విధింపును తాత్కాలికంగా వాయిదా వేసిన డొనాల్డ్ ట్రంప్‌పై ట్రూడో సెటైర్లు పేల్చారు. డొనాల్డ్ ట్రంప్ అధికారంలో ఉండగా పరిస్థితులు సంక్లిష్టంగా మారాయని అన్నారు. ఆయన పాలనను 10 సంవత్సరాల పాటు చూశానని కూడా అన్నారు. కెనేడియన్ల కోసం పనిచేయడం తనకు దక్కిన అత్యున్నత గౌరవమని కూడా వ్యాఖ్యానించారు. అమెరికాపై ప్రతికార సుంకాలకు తాము సిద్ధమేనని, ట్రంప్ వెనక్కు తగ్గేవరకూ తమ ప్రతిఘటన కొనసాగుతుందని అన్నారు. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య మరికొంత కాలం పాటు వాణిజ్య యుద్ధం జరుగుతుందని కూడా ట్రూడో అన్నారు. కష్టం కాలం ముందుందని కూడా కెనీడియన్లను హెచ్చరించారు.
Retaliatory Tariffs: 2 నుంచి భారత్‌పై ప్రతీకార సుంకాలు
‘‘మెక్సికో, కెనడా సుభీక్షంగా ఉన్నప్పుడే అమెరికాకు తనకు ప్రయోజనాలు కూడా దక్కుతాయి. అంతర్జాతీయ వాణిజ్యం, దౌత్యం, దేశాల మధ్య సంబంధాల తీరు ఇలాగే ఉంటుంది. అయితే, రియల్ ఎస్టేట్‌లో మాత్రం ఇలా జరగదు’’ అంటూ ట్రంప్ వ్యాపారాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆయనను ఎద్దేవా చేశారు.
పార్టీకి ప్రజల్లో తగ్గుతున్న పాప్యులారిటీ, అంతర్గత కుమ్ములాటలు మొదలవడంతో లిబరల్ పార్టీ సారథ్యం, ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ట్రూడో జనవరి 6న ప్రకటించారు. పార్టీ బాధ్యతల నుంచి తప్పుకోవాలంటూ స్వపక్షీయుల నుంచే డిమాండ్ల పెరగడంతో ఈ డిమాండ్లకు ట్రూడో తలొగ్గక తప్పలేదు.
Read Latest and International News