Tesla Cars Torched In France: మస్క్‌పై పెరుగుతున్న వ్యతిరేకత.. టెస్లా కార్లకు నిప్పు
ABN , Publish Date - Mar 06 , 2025 | 07:30 PM
ఎలాన్ మస్క్‌పై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ఫ్రాన్స్‌లో 12 టెస్లా కార్లు అగ్నికి ఆహుతైన ఘటన కలకలానికి దారి తీసింది.

ఇంటర్నెట్ డెస్క్: ఫ్రాన్స్‌లోని టోలోస్ ప్రాంతంలో టెస్లా కార్ల దగ్ధం కావడం కలకలం రేపుతోంది. నిందితులు కావాలనే టెస్లా కార్లకు నిప్పు పెట్టారా అనే కోణంలో స్థానిక పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ప్రమాదం కారణంగా టెస్లా డీలర్‌షిప్‌కు 7 లక్షల యూరోల నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది (Tesla Cars Torched In France ).
స్థానిక మీడియా కథనాల ప్రకారం, అమెరికా ప్రభుత్వంలో పెరిగిపోతున్న టెస్లా అధినేత మస్క్ జోక్యంపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబుకుతోంది. దీంతో, ఈ ఆగ్రాహావేశాలే నిందితులను ప్రతీకారానికి పురిగొల్పాయా అన్న చర్చ మొదలైంది. మస్క్ వ్యతిరేకంగా రాజకీయ పరమైన కార్యక్రమాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
China Retaliatory Tariffs on USA: డొనాల్డ్ ట్రంప్‌కు షాక్.. అమెరికా దిగుమతులపై చైనా సుంకాల విధింపు
ఘటన జరిగిన రోజున తెల్లవారు జామున 4.00 గంటల సమయంలో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో మొత్తం 7 కార్లు పూర్తిగా అగ్నికి ఆహుతవగా మిగిలిన కార్లు భారీగా దెబ్బతిన్నాయి. అయితే, అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించడంతో మంటలు త్వరగానే అదుపులోకి వచ్చాయి. డీలర్ కార్యాలయం చుట్టూ వేసిన కంచెకు ఓ చోట కన్నం పెట్టి ఉండటం కూడా గమనించారు. దీని వెనక కచ్చితంగా దురుద్దేశం ఉంటుందని అక్కడి పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీడియాతో వ్యాఖ్యానించారు. ఇటీవల అనేక అతివాద సంస్థలు టెస్లాకు హెచ్చరికలు జారీ చేసిన విషయాన్ని కూడా అధికారులు చెబుతున్నారు.
Ukraine Military aid Paused: ఉక్రెయిన్ అధ్యక్షుడికి భారీ షాకిచ్చిన ట్రంప్.. మిలిటరీ సాయం నిలిపివేత
అమెరికా ప్రభుత్వ వ్యవహారాల్లో పెరుగుతున్న టెస్లా అధినేత జోక్యం, ఐరోపాలోని సంప్రదాయ వాద పార్టీలకు మద్దతిస్తున్న వైనంపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతోంది. అనేక చోట్ల నిరసన కారులు టెస్లా కార్యాలయాల ముందు ప్రదర్శనకు దిగారు. ఫ్రాన్స్, జర్మనీల్లో టెస్ల కార్లకు అమ్మకాలు పడిపోయాయి. ఇక అమెరికాలోని మాసాచుసెట్స్‌లోని ఓ సూపర్ చార్జ్ కేంద్రానికి నిప్పు పెట్టిన ఘటన వెలుగు చూసింది. ఇక టోలూజ్ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Withdrawl from NATO: నాటో కూటమి నుంచి అమెరికా తప్పుకునేందుకు ఇదే సరైన సమయం: ఎలాన్ మస్క్
మరిన్ని అంతర్జాతీయ, వాణిజ్య వార్తల కోసం క్లిక్ చేయండి