Bitcoin: చెత్తకుప్పలో హార్డ్ డిస్క్ .. అందులో రూ.6,500కోట్ల బిట్‌కాయిన్ల గుట్టు
ABN , Publish Date - Feb 14 , 2025 | 05:28 AM
పన్నెండేళ్లుగా బిట్‌కాయిన్ల సమాచారాన్ని ఓ హార్డ్‌డి్‌స్కలో పదిలపరుచుకున్న ఓ టెకీ ఇప్పుడు ఓ చెత్తకుప్పను కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యాడు. అందుక్కారణం.. ఆ హార్డ్‌డి్‌స్కను అతని భార్య పొరపాటున చెత్తలో పారేయడమే..!

చెత్తలో పారేసిన టెకీ భార్య
చెత్త కుప్పనే కొనేందుకు టెకీ ప్లాన్
లండన్, ఫిబ్రవరి 13: పన్నెండేళ్లుగా బిట్‌కాయిన్ల సమాచారాన్ని ఓ హార్డ్‌డి్‌స్కలో పదిలపరుచుకున్న ఓ టెకీ ఇప్పుడు ఓ చెత్తకుప్పను కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యాడు. అందుక్కారణం.. ఆ హార్డ్‌డి్‌స్కను అతని భార్య పొరపాటున చెత్తలో పారేయడమే..! వివరాల్లోకి వెళ్తే.. బ్రిటన్‌కు చెందిన జేమ్స్ హోవెల్స్ కంప్యూటర్ నిపుణుడు. 2013లో అతను 8 వేల బిట్‌కాయిన్లను కొనుగోలు చేసి, ఆ సమాచారాన్ని ఓ హార్డ్‌డి్‌స్కలో భద్రపరిచారు. ఇప్పుడు ఆ బిట్‌కాయిన్స్ విలువ రూ.6,500 కోట్లకు పైనే ఉంటుంది. ఇటీవల ఆయన భార్య ఆ హార్డ్‌డి్‌స్కను పొరపాటున చెత్తలో పారేశారు. హార్డ్‌డిస్క్ కోసం వెతుకుతున్న జేమ్స్.. భార్యను అడగ్గా.. తాపీగా విషయం చెప్పింది.
దాంతో అతను హార్డ్‌డిస్క్ కోసం శోధన ప్రారంభించారు. తాము ఉండే ప్రాంతంలోని చెత్తను సౌత్‌వేల్స్‌లో కుప్పగా పోసినట్లు గుర్తించారు. అయితే.. న్యూపోర్ట్ సిటీ కౌన్సిల్ ఆ సైట్‌ను మూసివేస్తామని ఇటీవల ప్రకటించింది. దాంతో.. అక్కడ తన హార్డ్‌డిస్క్ కోసం వెతకడం కుదరదని గుర్తించిన జేమ్స్ కోర్టును ఆశ్రయించారు. చెత్తలో వెతకడం వల్ల ప్రజలపై దుష్ప్రభావం పడుతుందనే కారణంతో కోర్టు ఆ అభ్యర్థనను నిరాకరించింది. దాంతో జేమ్స్ ఇప్పుడు ఆ సైట్ మొత్తాన్ని కొంటానని అధికారులను సంప్రదించారు. అయితే.. జేమ్స్ ప్రయత్నం ఫలిస్తుందా? హార్డ్‌డిస్క్ దొరుకుతుందా? అనేది మిలియన్ బిట్‌కాయిన్ల ప్రశ్న..!