Russia Earthquake: రష్యాలో మరో భారీ భూకంపం
ABN , Publish Date - Aug 04 , 2025 | 03:48 AM
రష్యా తూర్పు ప్రాంతాన్ని మరో భారీ భూకంపం కుదిపేసింది. ఇటీవల 8.8 తీవ్రతతో భారీ భూకంపం వచ్చిన కమ్చాట్కా

స్వల్పస్థాయి సునామీ హెచ్చరికలు
మాస్కో, ఆగస్టు 3: రష్యా తూర్పు ప్రాంతాన్ని మరో భారీ భూకంపం కుదిపేసింది. ఇటీవల 8.8 తీవ్రతతో భారీ భూకంపం వచ్చిన కమ్చాట్కా ద్వీపకల్పానికి దక్షిణంగా ఉన్న కురిల్ దీవుల్లో ఆదివారం మధ్యాహ్నం 7.0 మ్యాగ్నిట్యూడ్ తీవ్రతతో ఈ భూకంపం వచ్చింది. తర్వాత 5, 6 తీవ్రతతో మరిన్ని ప్రకంపనలు వచ్చాయి. దీనితో కురిల్ దీవులతోపాటు కమ్చాట్కా ద్వీపకల్పంలోని పలు నగరాలు ఊగిపోయినట్టు రష్యా అత్యవసర వ్యవహారాల శాఖ ప్రకటించింది. పలు ప్రాంతాల్లో స్వల్ప స్థాయిలో సునామీలు రావొచ్చని హెచ్చరించింది. ఇక ఈ వరుస భూకంపాల ధాటికి కమ్చాట్కా ద్వీపకల్పంలో దాదాపు 6 వందల ఏళ్లుగా నిద్రాణంగా ఉన్న ‘క్రషెనిన్నికోవ్’ అగ్నిపర్వతం బద్దలైంది. సుమారు ఆరు కిలోమీటర్ల ఎత్తున దట్టమైన పొగలు, బూడిదను వెదజల్లింది. భారీగా లావా వెలువడుతోంది. వారం రోజుల క్రితం 8.8 తీవ్రతతో వచ్చిన భూకంపంతో బద్దలైన ‘క్ల్యుచెవ్‌స్కోయ్’ అగ్నిపర్వతానికి సుమారు 160 కిలోమీటర్ల దూరంలోనే ఈ ‘క్రషెనిన్నికోవ్’ అగ్నిపర్వతం ఉండటం గమనార్హం.
చివరి సి-295 భారత్‌కు చేరింది.. అప్పగింతలు పూర్తి చేసిన స్పెయిన్
తేజస్వి యాదవ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి