Skype: మేలో స్కైప్ మూసివేత: మైక్రోసాఫ్ట్
ABN , Publish Date - Mar 01 , 2025 | 06:17 AM
ప్రపంచానికి వీడియో కాన్ఫరెన్సింగ్ అనే సదుపాయాన్ని పరిచయం చేసిన తొలినాటి ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన ‘స్కైప్’ త్వరలో మూతబడనుంది.

వాషింగ్టన్, ఫిబ్రవరి 28: ప్రపంచానికి వీడియో కాన్ఫరెన్సింగ్ అనే సదుపాయాన్ని పరిచయం చేసిన తొలినాటి ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన ‘స్కైప్’ త్వరలో మూతబడనుంది. ఈ విషయాన్ని స్కైప్ యాజమాన్య సంస్థ మైక్రోసాఫ్ట్ తన అంతర్గత వేదిక అయిన ఎక్స్‌డీఏలో వెల్లడించింది. మే నెల నుంచి స్కైప్ అందుబాటులో ఉండదని తెలిపింది. స్కైప్ యూజర్లు.. టీమ్స్‌కు (ఇది కూడా మైక్రోసా్‌ఫ్టకు చెందినదే) బదిలీ కావచ్చని, ఇప్పటికే పలువురు టీమ్స్‌ను ఉపయోగించుకుంటున్నారని పేర్కొంది. 2003లో స్కైప్ ఆవిర్భవించింది. 2011లో ఆ ప్లాట్‌ఫాంను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది.