Russia Ukraine War: రష్యా క్షిపణి దాడులు.. ఆరుగురు ఉక్రెయిన్ పౌరుల మృతి..
ABN , Publish Date - Nov 09 , 2025 | 09:58 AM
శనివారం రష్యా జరిపిన దాడుల్లో ఆరుగురు ఉక్రెయిన్ పౌరులు మరణించారు. ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాల్లోని గృహ సముదాయాలపై జరిపిన దాడుల్లో ఆరుగురు మరణించారు. ఉక్రెయిన్‌లోని నిప్రో, జఫోరిజ్జియా నగరాలపై రష్యా క్షిపణులు, డ్రోన్‌లతో దాడులకు పాల్పడింది.
శనివారం రష్యా జరిపిన దాడుల్లో ఆరుగురు ఉక్రెయిన్ పౌరులు మరణించారు. ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాల్లోని గృహ సముదాయాలపై జరిపిన దాడుల్లో ఆరుగురు మరణించారు. ఉక్రెయిన్‌లోని నిప్రో, జఫోరిజ్జియా నగరాలపై రష్యా క్షిపణులు, డ్రోన్‌లతో దాడులకు పాల్పడింది. మొత్తం 45 క్షిపణులు, 458 డ్రోన్‌లతో రష్యా ఈ దాడికి దిగింది (Russia Ukraine war news).
నిప్రోలోని ఓ అపార్ట్‌మెంట్ భవనంపై జరిపిన దాడిలో ఇద్దరు పౌరులు మరణించారు. 12 మంది గాయపడ్డారు. ఇక, జఫోరిజ్జియాపై జరిగిన దాడిలో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తొమ్మిది అంతస్థుల భవనంపై జరిపిన డ్రోన్ దాడిలో పలు ఫ్లాట్‌లు ధ్వంసమయ్యాయి. అలాగే ఓ విద్యుత్ పరిశ్రమపై జరిగిన దాడిలో ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. రష్యా ప్రయోగించిన మొత్తం 45 క్షిపణుల్లో 32 బాలిస్టిక్ క్షిపణులే కావడం గమనార్హం (six dead Ukraine).
రష్యా ప్రయోగించిన 458 డ్రోన్‌లలో 406 డ్రోన్‌లను, తొమ్మిది క్షిపణులను తమ సైన్యం గాల్లోనే పేల్చేసినట్టు ఉక్రెయిన్ వైమానిక అధికారులు తెలిపారు (Russia Ukraine crisis). కాగా, త్వరలో అణు పరీక్షలు నిర్వహించేందుకు కూడా రష్యా రెడీ అవుతున్నట్టు సమాచారం. అధ్యక్షుడు పుతిన్ ఆదేశాల మేరకు అణ్వస్త్ర పరీక్షలను నిర్వహించడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ శనివారం వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
ఒహాయో గవర్నర్ ఎన్నికలు.. వివేక్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ట్రంప్
డీఎన్ఏ నిర్మాణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త జేమ్స్ డీ వాట్సన్ కన్నుమూత
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి