Share News

Saudi Arabia Executions: సౌదీలో ఒకే రోజు 8 మందికి ఉరిశిక్ష

ABN , Publish Date - Aug 04 , 2025 | 03:52 AM

సౌదీ అరేబియా ఆదివారం ఒక్కరోజే నేరం రుజువైన ఎనిమిది మంది ఖైదీలకు ఉరిశిక్షను అమలు చేసింది..

Saudi Arabia Executions: సౌదీలో ఒకే రోజు 8 మందికి ఉరిశిక్ష

రియాద్‌, ఆగస్టు 3: సౌదీ అరేబియా ఆదివారం ఒక్కరోజే నేరం రుజువైన ఎనిమిది మంది ఖైదీలకు ఉరిశిక్షను అమలు చేసింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో అరెస్టయిన సోమాలియాకు చెందిన నలుగురికి, ముగ్గురు ఇఽథియోపియన్లకు, తన తల్లిని చంపిన సౌదీకే చెందిన ఓ ఖైదీకి మరణశిక్ష విధించింది. ఈ ఎనిమిది మందితో కలిపి ఈ ఏడాది మొత్తం మీద 230 మందికి ఆ దేశం మరణశిక్షను విధించింది. వీరిలో 154 మంది మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తూ చిక్కిన వారే ఉన్నట్లు సౌదీ ప్రెస్‌ ఏజెన్సీ పేర్కొంది. 2023 నుంచి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా పట్ల సౌదీ కఠినంగా వ్యవహరిస్తోంది.


చివరి సి-295 భారత్‌కు చేరింది.. అప్పగింతలు పూర్తి చేసిన స్పెయిన్

తేజస్వి యాదవ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 04 , 2025 | 03:52 AM