Pakistan: పాక్ రక్షణ బడ్జెట్ భారీగా పెంపు.. అభివృద్ధి కంటే ఆయుధాలకే ప్రాధాన్యం..
ABN , Publish Date - Jun 11 , 2025 | 05:03 PM
ఇస్లామాబాద్ గత నెలలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నుంచి 2.4 బిలియన్ డాలర్ల ఆర్థికసాయం పొందింది. 2025-26 బడ్జెట్‌ను రూపొందించే ముందు ఐఎంఎఫ్‌తో సంప్రదింపులు జరుపేందుకు కట్టుబడి ఉన్నట్టు ఇస్లామాబాద్ ప్రకటించింది.

ఇస్లామాబాద్: పాకిస్థాన్ రుణభారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి తొమ్మిది నెలల్లో సుమారు 270 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ క్రమంలో అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన పాకిస్థాన్ అందుకు బదులుగా తమ రక్షణ బడ్జెట్‌ను అమాంతం పెంచేసింది. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి గాను రక్షణ బడ్జెట్‌ను 20 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. పాక్ ఆర్థికమంత్రి మహమ్మద్ ఔరంగజేబ్ ఈ మేరకు పార్లమెంటులో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో సైనిక వ్యయానికి పెద్దపీట వేశారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో తీవ్రంగా దెబ్బతిన్న కొద్ది రోజుల్లోనే దేశ రక్షణ బడ్జెట్‌ను పెంచుతూ పాక్ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజా బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, రక్షణ రంగానికి 9 బిలియన్ డాలర్లు కేటాయించారు. మొత్తం బడ్జెట్లో ఇది 14.5 శాతంగా, జీడీపీలో 2.2 శాతంగా ఉంది. ఇక, జీడీపీ లోటు 3.9 శాతంగా అంచనా వేశారు. 2024-25లో ఇది 5.9 శాతం ఉంది. దవ్రోల్బణం 7.5 శాతం, వృద్ధి 4.2 శాతంగా ఉంటుందని పేర్కొన్నారు.
కాగా, బడ్జెట్లో గతేడాది కంటే 20 శాతం నిధులు పెంచిన పాక్ .. ప్రభుత్వ ఖర్చులో మాత్రం 7 శాతం కోత వేసింది. పర్యావరణ బడ్జెట్లోనూ కోత విధించింది. ఇస్లామాబాద్ గత నెలలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నుంచి 2.4 బిలియన్ డాలర్ల ఆర్థికసాయం పొందింది. 2025-26 బడ్జెట్‌ను రూపొందించే ముందు ఐఎంఎఫ్‌తో సంప్రదింపులు జరిపేందుకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించింది. పాకిస్థాన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రైవేటుపరం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఆర్థికమంత్రి మహమ్మద్ ఔరంగజేబ్ బడ్జెట్ సందర్భంగా ప్రకటించారు. యావద్దేశం ఐక్యత, దృఢ సంకల్పంతో ఉన్న చారిత్రక దశలో ఈ బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్టు ఇండియా-పాక్ మధ్య గత నెలలో జరిగిన యుద్ధాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ చెప్పారు. కాగా, బడ్జెట్లో ప్రకృతి విపత్తులు, విద్య, వ్యవసాయం కంటే రక్షణ రంగానికి అధిక నిధులు కేటాయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Pakistan: ఇంత జరుగుతున్నా పాకిస్తాన్ బుద్ధి మారటం లేదు..
LA Protests: రగులుతున్న లాస్ ఏంజెల్స్.. 2 వేల మంది గార్డ్స్‌తో..!
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి