Share News

Asim Munir: పాక్ ఆర్మీ చీఫ్‌కు ఫీల్డ్ మార్షల్‌గా ప్రమోషన్.. దేశంలోనే అత్యున్నత మిలటరీ ర్యాంక్

ABN , Publish Date - May 20 , 2025 | 07:31 PM

ప్రస్తుతం పాక్‌లో రాజకీయ అనిశ్చితి, భద్రతా సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో, ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో మిలటరీ ఆపరేషన్లు నడుస్తున్న క్రమంలో ఆసిమ్ మునిర్‌కు పదోన్నత కల్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Asim Munir: పాక్ ఆర్మీ చీఫ్‌కు ఫీల్డ్ మార్షల్‌గా ప్రమోషన్.. దేశంలోనే అత్యున్నత మిలటరీ ర్యాంక్

ఇస్లామాబాద్: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) సారథ్యంలోని పాక్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునిర్ (Asim Munir)ను ఫీల్డ్ మార్షల్‌ (Field Marshal)గా ప్రమోట్ చేసింది. ఫీల్డ్ మార్షల్ టైటిల్ అనేది పాకిస్థాన్‌లోని అత్యున్నత మిలటరీ ర్యాంకు. ఈ గౌరవాన్ని అందుకున్న రెండో వ్యక్తి ఆసిమ్ మునిర్ కావడం విశేషం. ఆయనకు ముందు మాజీ మిలటరీ రూలర్ ఫీల్ట్ మార్షల్ అయూబ్ ఖాన్ ఈ గౌరవం అందుకున్నారు.

Trump Putin Call: రష్యా-ఉక్రెయిన్ కాల్పుల విరమణ చర్చలపై ట్రంప్ కీలక ప్రకటన..


ఆసిమ్ మునిర్‌ను ఫీల్డ్ మార్షల్‌గా ప్రమోట్ చేయాలనే నిర్ణయానికి పాకిస్థాన్ ఫెడరల్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 2022 నవంబర్‌లో పాకిస్థాన్ ఆర్మీ పగ్గాలు చేపట్టారు. ప్రస్తుతం పాక్‌లో రాజకీయ అనిశ్చితి, భద్రతా సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో, ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో మిలటరీ ఆపరేషన్లు నడుస్తున్న క్రమంలో ఆసిమ్ మునిర్‌కు పదోన్నత కల్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశానికి సంబంధించిన వ్యవహారాల్లో ఆర్మీ ప్రభావం కొనసాగుతోందనడానికి ఉదాహరణగా కూడా దీనిని చెప్పవచ్చు.


వాయిసేన చీఫ్ పదవీకాలం పొడిగింపు

కాగా, ఆసిమ్ మునిర్‌కు పదోన్నతితో పాటు ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ పదవీకాలాన్ని కూడా పొడిగిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆయన త్వరలో పదవీ విరమణ చేయాల్సి ఉండగా ప్రస్తుతం ఆయన తన పదవిలో కొనసాగుతారు.


ఇవి కూడా చదవండి..

Trump Putin Call: రష్యా-ఉక్రెయిన్ కాల్పుల విరమణ చర్చలపై ట్రంప్ కీలక ప్రకటన..

Israel Gaza conflict: గాజాను స్వాధీనం చేసుకుంటాం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 20 , 2025 | 07:32 PM