Share News

Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కు బంగారు పేజర్‌ను బహూకరించిన ఇజ్రాయెల్ అధ్యక్షుడు

ABN , Publish Date - Feb 06 , 2025 | 11:14 PM

హెజ్బొల్లాపై పేజర్ దాడులకు గుర్తుగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నేతన్యాహూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఓ బంగారు పేజర్‌ను బహుమతిగా ఇచ్చారు.

Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కు బంగారు పేజర్‌ను బహూకరించిన ఇజ్రాయెల్ అధ్యక్షుడు

ఇంటర్నెట్ డెస్క్: హెజ్బోల్లాపై దాడికి గుర్తుగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నేతన్యాహూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బంగారు పేజర్‌ను బహుమతిగా ఇచ్చారు. మంగళవారం శ్వేతసౌధంలో ట్రంప్‌తో సమావేశమైన సందర్భంగా నేతన్యాహూ బంగారు పేజర్‌తో పాటు ఓ సాధారణ పేజర్‌ను కూడా బహుమతిగా ఇచ్చారు. బహుమతికి ధన్యవాదాలు తెలిపిన ట్రంప్.. నాటి ఆపరేషన్ అద్భుతమని కొనియాడారు.

హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ గతేడాది పేజర్‌లతో దాడి చేసిన విషయం తెలిసిందే. పేజర్లలో పేలుడు పదార్థా్న్ని అమర్చి ఎవరికీ అనుమానం రాకుండా హెజ్బోల్లా ఉగ్రవాదులకు వాటిని చేరవేసింది. ఆ తరువాత పేజర్‌లను ఉగ్రవాదులు చేతపట్టుకున్న సందర్భంగా అవి పేలడంతో అనేక మంది మరణించారు. దీంతో హెజ్బొల్లాకు భారీ నష్టం వాటిల్లింది. ఆ మరుసటి రోజు వాకీ టాకీలు కూడా పేలడంతో అనేక మంది ఉగ్రవాదులు మరణించారు.

Sheikh Hasina: తప్పక పగ తీర్చుకుంటా.. వార్నింగ్ ఇచ్చిన మాజీ ప్రధాని


ఇది జరిగిన రెండు నెలలకు ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నేతన్యాహూ పేజర్ ఆపరేషన్‌ను ధ్రువీకరించారు. ఈ దాడుల వెనక ఉన్నది తామేనని ప్రకటించారు. హెజ్బొల్లా ఉగ్రవాదులు వాటిన పేజర్లలో కొన్ని నెలల క్రితమే పేలుడు పదార్థాలను ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మోసాడ్ అమర్చినట్టు వెలుగులోకి వచ్చింది. కాగా, ఈ దాడుల్లో 39 మంది మరణించగా సుమారు 3 వేల మంది గాయపడ్డారు.

Aga Khan : ఆగాఖాన్‌ కన్నుమూత


ఇదెలా ఉంటే.. ఇటీవల అమెరికాకు వెళ్లిన ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నేతన్యాహూ ట్రంప్‌కు ఎన్నికల్లో విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల వ్యూహాత్మక సంబంధాలతో పాటు మధ్య ప్రాచ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా రెండు దేశాల నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. అనంతరం జరిగిన పత్రికా సమావేశంలో ట్రంప్ గాజా స్ట్రిప్‌ను ‘స్వాధీనం’ చేసుకోవడంపై కూడా స్పందించారు. ఈ పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఎలాన్ మస్క్‌ను కూడా కలిశారు. ఇరువురు కూలిసి దిగిన ఫొటోను నేతన్యాహూ కుమారుడు నెట్టింట పంచుకున్నారు. మస్క్, నేతన్యాహూలు మేధావులు అంటూ కామెంట్ చేశారు.

Read Latest and International News

Updated Date - Feb 07 , 2025 | 12:04 AM