Share News

Nepal new 100 rupee note: తీరు మార్చుకోని నేపాల్.. కొత్త వంద రూపాయల నోటుపై..

ABN , Publish Date - Nov 27 , 2025 | 09:25 PM

తాజాగా నేపాల్ విడుదల చేసిన కొత్త వంద రూపాయల నోటు వివాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్తోంది. తాజాగా నేపాల్ విడుదల చేసిన వంద రూపాయల నోటుపై ఆ దేశ మ్యాప్ ఉంది. అయితే ఆ మ్యాప్‌లో కాలాపానీ, లిపులేఖ్, లింపియాధుర భూభాగాలు ఉన్నాయి.

Nepal new 100 rupee note: తీరు మార్చుకోని నేపాల్.. కొత్త వంద రూపాయల నోటుపై..
Nepali banknote dispute

భారత్‌తో సరిహద్దు వివాదాన్ని నేపాల్ కొనసాగించాలనే కృత నిశ్చయంతో ఉంది. తాజాగా నేపాల్ విడుదల చేసిన కొత్త వంద రూపాయల నోటు వివాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్తోంది. తాజాగా నేపాల్ విడుదల చేసిన వంద రూపాయల నోటుపై ఆ దేశ మ్యాప్ ఉంది. అయితే ఆ మ్యాప్‌లో కాలాపానీ, లిపులేఖ్, లింపియాధుర భూభాగాలు ఉన్నాయి. ఆ భూభాగాలు భారతదేశానికి చెందినవని కేంద్ర ప్రభుత్వం పదే పదే చెబుతోంది (Nepal India border dispute).


నేపాల్ తాజా చర్య సంవత్సరాల తరబడి కొనసాగుతున్న సరిహద్దు వివాదాన్ని మళ్ళీ రేకెత్తించింది. 2020 మే నెలలో కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని ప్రభుత్వం లిపులేఖ్, కాలాపానీ, లింపియాధుర ప్రాంతాలను నేపాల్ భూభాగంగా చూపిస్తూ కొత్త మ్యాప్‌ను ఆవిష్కరించినప్పుడు ఈ వివాదం మొదలైంది. ఆ సమయంలో భారతదేశం తీవ్రంగా స్పందించింది. ఇది చారిత్రక ఆధారాలు లేని ఏకపక్ష చర్య అని పేర్కొంది. అప్పట్నుంచి ఈ వివాదం ఇరు దేశాల మధ్య నలుగుతూనే ఉంది (Kalapani Lipulekh Limpiyadhura map).


నేపాల్ రాష్ట్ర బ్యాంక్ (NRB) తాజాగా జారీ చేసిన కొత్త 100 రూపాయల కరెన్సీ నోటుపై మునుపటి గవర్నర్ మహా ప్రసాద్ అధికారి సంతకం ఉంది (Nepal currency controversy). ఈ నోటు జారీ చేసిన తేదీ 2081 బీఎస్. అంటే ఇది గత సంవత్సరం (2024)ని సూచిస్తుంది. కాగా, పాత 100 రూపాయల నోటులో మ్యాప్ ఎప్పట్నుంచో ఉందని, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఆ నోటును నవీకరించినట్లు ఎన్ఆర్బీ అధికారి చెప్పినట్టు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. కాగా, సిక్కిం, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి ఐదు భారతీయ రాష్ట్రాలతో నేపాల్ 1,850 కిలోమీటర్లకు పైగా సరిహద్దును పంచుకుంటోంది.


ఇవి కూడా చదవండి:

ఏఐని గుడ్డిగా నమ్మొద్దు.. ఆల్ఫబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ హెచ్చరిక

టీనేజర్ల సోషల్ మీడియా అకౌంట్స్‌పై బ్యాన్.. ఆస్ట్రేలియాను వీడుతున్న కంటెంట్ క్రియేటర్లు

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 27 , 2025 | 09:25 PM