Share News

Nepal: టూరిజం ఈవెంట్‌లో గాయపడిన ఉప ప్రధాని.. ఆసుపత్రికి తరలింపు

ABN , Publish Date - Feb 15 , 2025 | 05:50 PM

హైడ్రోజన్‌తో నింపిన బెలూన్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని, దీంతో వేదకపై ఉన్న బిష్ణు పౌడెల్, ధన్‌రాజ్ ఆచార్య గాయపడ్డారని ఖాట్మండు పోస్ట్ తెలిపింది. తదుపరి చికిత్స కోసం ఖాట్మండు తరలించినట్టు కాస్కి జిల్లా ఎస్పీ శ్యామ్‌నాథ్ ఓలియా తెలిపారు.

Nepal: టూరిజం ఈవెంట్‌లో గాయపడిన ఉప ప్రధాని.. ఆసుపత్రికి తరలింపు

ఖాట్మండు: నేపాల్ (Nepal) ఉప ప్రధాని బిష్ణు పౌడెల్ పోఖరా, మెట్రోపాలిటన్ మేయర్ ధనరాజ్ ఆచార్య శనివారంనాడు జరిగిన ఒక ఈవెంట్‌లో గాయపడ్డారు. శరీరంపై కాలిన గాయాలతో ఉన్న వారిని హుటాహుటిన ఎయిర్‌లిఫ్ట్‌లో ఖాట్మండుకు తరలించారు. పోఖరా టూరిజం ఇయర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు వీరు ప్రమాదం బారిన పడ్డారు.

F-35 Jets: ఎఫ్‌- 35 డీల్‌ జరిగే పనేనా?


హైడ్రోజన్‌తో నింపిన బెలూన్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని, దీంతో వేదకపై ఉన్న బిష్ణు పౌడెల్, ధన్‌రాజ్ ఆచార్య గాయపడ్డారని ఖాట్మండు పోస్ట్ తెలిపింది. తదుపరి చికిత్స కోసం ఖాట్మండు తరలించినట్టు కాస్కి జిల్లా ఎస్పీ శ్యామ్‌నాథ్ ఓలియా తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేశారు.


హెడ్రోజన్ బెలూన్ పేలిన ఘటనలో పౌడల్ చేతులు, ముఖానికి గాయాలైనట్టు ఆయన ప్రెస్ అడ్వయిజర్ భువన్ కెసీ తెలిపారు. ఆచార్యకు సైతం పలుచోట్ల గాయాలైనట్టు చెప్పారు. పౌడెల్ ఉపప్రధానిగా ఉండటంతో పాటు దేశ ఆర్థిక మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కి థాంక్స్ చెప్పిన ప్రధాని మోదీ.. కారణం ఇదే

మా దేశంలో చదువుకోండి.. పని చేసుకోండి!

Dubai: దుబాయ్‌లో వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌పై చర్చలు..

మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 15 , 2025 | 05:50 PM