Share News

NASA Employees Resign: ఆర్ధిక సంక్షోభంలో నాసా .. 2000 మందికి పైగా ఉద్యోగులకు షాక్.!

ABN , Publish Date - Jul 11 , 2025 | 07:43 AM

నాసాలో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రభుత్వ చర్యలతో 2,145 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.

NASA Employees Resign: ఆర్ధిక సంక్షోభంలో నాసా .. 2000 మందికి పైగా ఉద్యోగులకు షాక్.!
NASA

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అంతరిక్ష సంస్థ నాసా (NASA) 2,145 మంది ఉద్యోగులను సంస్థ నుండి తప్పించే సన్నాహాలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కోతల నేపథ్యంలో ముఖ్యంగా సైన్స్‌, అంతరిక్ష ప్రయాణం వంటి కీలక మిషన్లపై పనిచేస్తున్న అనుభవజ్ఞులైన ఉద్యోగులపై ఈ ప్రభావం పడుతోంది.


పోలిటికో అనే మీడియా నివేదిక ప్రకారం, తొలగించబడే ఉద్యోగులలో ఎక్కువ మంది GS-13 నుంచి GS-15 స్థాయిలో ఉన్న సీనియర్ అధికారులు ఉన్నారు. వీరు ప్రభుత్వంలో ముఖ్యమైన నిర్వహణ, సాంకేతిక బాధ్యతలు నిర్వహిస్తూ, నాసా విజయవంతమైన మిషన్లలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే, ప్రభుత్వం వీరికి ముందస్తు పదవీవిరమణ, ద్రవ్య పరిహారం లేదా రాజీనామా రూపంలో ఆఫర్లు అందిస్తోంది. అందులో 1,818 మంది సైన్స్, అంతరిక్ష ప్రయాణాలకు సంబంధించిన శాఖలలో పనిచేస్తున్నారు. మిగతా వారు ఐటీ, లాజిస్టిక్స్ వంటి ఇతర సహాయక విభాగాల్లో ఉన్నారు.


ఎక్కడెక్కడ ఉద్యోగ కోతలు?

  • నాసా గోడ్దార్డ్ స్పేస్ సెంటర్ (మెరిల్యాండ్): 607 ఉద్యోగాల కోత

  • జాన్సన్ స్పేస్ సెంటర్ (టెక్సాస్): 366 మంది

  • కెన్నెడీ స్పేస్ సెంటర్ (ఫ్లోరిడా): 311 మంది

  • నాసా ప్రధాన కార్యాలయం (వాషింగ్టన్): 307 మంది

  • లాంగ్లీ రీసెర్చ్ సెంటర్ (వర్జీనియా): 281 మంది

  • మార్షల్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ (అలబామా): 179 మంది

  • గ్లెన్ రీసెర్చ్ సెంటర్ (ఓహాయో): 191 మంది

ఈ ఉద్యోగ కోతలు నాసా పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతాయన్న ఆందోళన ఉంది. దశాబ్దాలుగా సేవలందిస్తున్న నిపుణులను తొలగించడం వల్ల కీలక పరిశోధనలు, అంతరిక్ష మిషన్ల ప్రణాళికల్లో ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.


Also Read:

ఏఐతో మైక్రోసాఫ్ట్‌కు రూ.4 వేల కోట్లు ఆదా

నిమిష ప్రియ మరణశిక్షపై చివరి నిమిషంలో మలుపు

For More National News

Updated Date - Jul 11 , 2025 | 08:16 AM