Share News

India Pakistan Tensions: పాక్ మంత్రి సిగ్గుమాలిన ప్రకటన

ABN , Publish Date - May 10 , 2025 | 05:22 PM

సొంత పౌరుల ప్రాణాలు బలపెట్టేందుకు పాక్ నిస్సిగ్గుగా సిద్ధమవుతోంది. భారత్‌పై ఇటీవల పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా మరోసారి తన నీచ బుద్ధిని, చేతకానితనాన్ని చాటుకున్నారు.

India Pakistan Tensions: పాక్ మంత్రి సిగ్గుమాలిన ప్రకటన

ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడితో కయ్యానికి కాలుదువ్విన పాకిస్తాన్ ఇప్పుడు భారత్ కన్నెర్ర చేయడంతో దిగ్గుతోచని పరిస్థితుల్లో పడింది. ఓవైపు ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యిందంటూ ప్రపంచ దేశాల ముంగిట రుణాల కోసం వెంపర్లాడుతూ, ఉద్రిక్తతలు తగ్గించేందుకు ముందుగా భారత్ చొరవ తీసుకోవాలంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. మరోవైపు, సొంత పౌరుల ప్రాణాలు బలపెట్టేందుకు నిస్సిగ్గుగా సిద్ధమవుతోంది. భారత్‌పై ఇటీవల పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా మరోసారి తన నీచ బుద్ధిని, చేతకానితనాన్ని చాటుకున్నారు. ఇందుకు నిస్సిగ్గుగా పార్లమెంటును వేదికగా చేసుకున్నారు.

Operation Sindhoor: ఇకపై ఏ ఉగ్రదాడినైనా యుద్ధ చర్యగా పరిగణిస్తాం: పాక్‌స్థాన్‌కు భారత్ సీరియస్ వార్నింగ్


రక్షణ కవచాలుగా మదర్సా విద్యార్థులు

అత్యవసర పరిస్థితులు తలెత్తితే మదర్సాలలో చదువుకునే విద్యార్థులను రెండవ రక్షణ కవచంగా ఉపయోగిస్తామని ఖవాజా ఆసిఫ్ పార్లమెంటులో ప్రకటించారు. ''వారు (మదర్సా విద్యా్ర్థులు) నిస్సందేహంగా ఈ దేశ రెండవ రక్షణ కవచాలు. అక్కడ చదువుకుంటున్న యువకులు వారు. సమయం వచ్చినప్పుడు వారిని 100 శాతం ఉపయోగించుకుంటాం'' అని ఆసిఫ్ వ్యాఖ్యానించారు. పహల్గాం ఉగ్రదాడులకు ప్రతిగా ఆపరేషన్ సిందూర్ పేరుతో పీఓకేలోని 26 ఉగ్రస్థావరాలపై భారత బలగాలు విరుచుకుపడి 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టిన నేపథ్యంలో పాక్ పార్లమెంటులో ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేసారు. చదువుకుంటున్న విద్యార్థులను రక్షణ కవచాలుగా వాడుకుని వారి ప్రాణాలను పణంగా పెడతామంటూ వ్యాఖ్యలు చేసిన అసిఫ్ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: భారత్, పాక్ యుద్ధం అప్‌డేట్స్ మీ ఫోన్లో చూడాలనుకుంటే ఇలా చేయండి..

India Pakistan Tensions: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ.. దేశంలో నిత్యావసరాలపై కీలక ప్రకటన

India Pakistan Tension: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ జమ్మూ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 10 , 2025 | 05:52 PM