Share News

Katy Perry: ప్రముఖ పాప్ సింగర్ పెర్రీతో కెనడా మాజీ ప్రధాని ట్రూడో డేటింగ్ నిజమేనా

ABN , Publish Date - Jul 30 , 2025 | 10:53 AM

కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో (53) రాజకీయాల్లోనే కాదు, ప్రస్తుతం డేటింగ్ వార్తల్లో నిలిచి చర్చనీయాంశంగా మారారు. ప్రపంచ ప్రఖ్యాత పాప్ సింగర్ కేటీ పెర్రీ (40)తో ఆయన పలుమార్లు కనిపించడం ప్రస్తుతం హాట్ టాపిక్‎గా మారింది.

Katy Perry: ప్రముఖ పాప్ సింగర్ పెర్రీతో కెనడా మాజీ ప్రధాని ట్రూడో డేటింగ్ నిజమేనా
katy perry justin trudeau

కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో (53) (Justin Trudeau) పదవిలో లేనప్పటికీ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఎలాంటి కామెంట్లు ఆయన చేయలేదు. కానీ ప్రపంచ ప్రఖ్యాత పాప్ సింగర్ కేటీ పెర్రీ(40)తో ఆయన పలుమార్లు కనిపించడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. జూలై 28న మోంట్రియాల్‌లోని ప్రముఖ రెస్టారెంట్లో వీరిద్దరూ కలిసి డిన్నర్ చేశారు. అందుకు సంబంధించిన చిత్రాలు వెలుగులోకి రావడంతో వీరిద్దరూ డేటింగ్‎లో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.


వెలుగులోకి వచ్చిన చిత్రంలో వీరిద్దరూ ఓ విశ్రాంత వాతావరణంలో కూర్చుని కాక్‌టెయిల్స్ ను ఆస్వాదించగా, అక్కడి ప్రముఖ చెఫ్ డానీ స్మైల్స్ కూడా వీరితో సమావేశమయ్యారు. భోజనం అనంతరం కిచెన్‌కి వెళ్లి, అక్కడి స్టాఫ్‌కు ధన్యవాదాలు చెప్పినట్లు సమాచారం. ఒక వంటకంగా లాబ్‌స్టర్ కూడా వడ్డించబడినట్టు తెలుస్తోంది.

కేటీ పెర్రీ ఇటీవలే తన ప్రియుడు, హాలీవుడ్ నటుడు ఒర్లాండో బ్లూమ్తో తన నిశ్చితార్థాన్ని విరమించుకున్నారు. దాదాపు పది సంవత్సరాల సంబంధం తర్వాత, ఇద్దరూ ఒక సంయుక్త ప్రకటనలో తమ సంబంధాన్ని కో పేరెంటింగ్‌పై దృష్టి పెట్టేలా మార్చుకుంటున్నామని తెలిపారు. వీరి కుమార్తె డైసీ డవ్ తమకు ప్రాధాన్యతగా ఉందని పేర్కొన్నారు.


ఇక జస్టిన్ ట్రూడో 2023 ఆగస్టులో తన భార్య సోఫీ గ్రెగోయిర్తో విడాకులు తీసుకున్నారు. 18 ఏళ్ల తన వైవాహిక జీవితం తర్వాత విడిపోయినప్పటికీ, ఇద్దరూ తమ ముగ్గురు పిల్లల కోసం కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు. వారి పిల్లలు జేవియర్ (17), ఎల్లా గ్రేస్ (16), హడ్రియెన్ (11).

ఈ డిన్నర్ వీరి మధ్య కొత్త రొమాన్స్ ప్రారంభమైందా? లేకపోతే ఇది కేవలం స్నేహపూర్వక సమావేశమా? అనే అంశంపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదు. కేటీ పెర్రీ, ట్రూడో టీమ్‌లు కూడా స్పందించలేదు. కానీ ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి

రష్యాలో భారీ భూకంపం.. జపాన్, అమెరికాలో సునామీ అలర్ట్

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 30 , 2025 | 10:57 AM