Bilawal Bhutto: అది నా మాట కాదు.. వెనక్కి తగ్గిన బిలావల్ భుట్టో
ABN , Publish Date - Apr 30 , 2025 | 09:57 PM
ఎల్ఓసీ, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ పదేపదే తూట్లు పొడుస్తోందంటూ ఇండియా చేస్తున్న ఆరోపణలను బిలావల్ తోసిపుచ్చారు. అందువల్ల తమకు కలిసొచ్చేదేమిటని ప్రశ్నించారు.

ఇస్లామాబాద్: సింధు నదిలో నీరు ప్రవహించకపోతే పాక్ ప్రత్యర్థుల రక్తం పారుతుందంటూ పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP) చీఫ్ బిలావల్ భుట్టో జర్దారీ (Bilawal Bhutto Zardari) ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో పార్టీలకు అతీతంగా ఇండియాలోని ప్రముఖ నేతలందరికీ బిలావల్‌పై దుమ్మెత్తి పోశారు. మీ తల్లి, తాత ఉగ్రవాదుల చేతుల్లో హతమైన విషయం మీకు తెలియదా? అది తప్పయితే పహల్గాం ఉగ్రదాడి తప్పుకాకుండా ఒప్పవుతుందా అని నేతలు చీవాట్లు పెట్టారు. ధైర్యం ఉంటే ఇండియాకు రావాలని మరికొందరు బిలావల్ భుట్లోకి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో బిలావల్ తాజాగా బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యలో వెనక్కి తగ్గారు. సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించడంతో పాకిస్థాన్ ప్రజల మనోభావాలను ప్రతిబింబించేలా చేసిన వ్యాఖ్యలే కానీ, అవి తన వ్యక్తిగత అభిప్రాయాలు కావని చెప్పారు.
Bilawal Bhutto Indus treaty: అదే జరిగితే సింధూ నదిలో వారి రక్తం పారుతుంది.. బిలావాల్ భుట్టో పిచ్చి కూతలు
''ఒక విషయం మీకు కూడా తెలుసని నేను నిశ్చయంగా చెప్పగలను. యుద్ధం అంటూ వస్తే రక్తం పారుతుంది'' అని ఒక ప్రశ్నకు సమాధానంగా బిలావల్ చెప్పారు. సింధూ జలాల ఒప్పందాన్ని ఉపసంహరించుకునే ఎలాంటి చర్య అయినా యుద్ధం ప్రకటనగా పాకిస్థాన్ చూస్తుందన్నారు. తమకు నదులను అడ్డుకునే శక్తి లేకపోయినా జలాలను భారత్ ఆయుధంగా మారిస్తే అది యుద్ధమే అవుతుందని చెప్పారు.
ఎల్ఓసీ, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ పదేపదే తూట్లు పొడుస్తోందంటూ ఇండియా చేస్తున్న ఆరోపణలను బిలావల్ తోసిపుచ్చారు. అందువల్ల తమకు కలిసొచ్చేదేమిటని ప్రశ్నించారు. భారత్ కాల్పులు మొదలుపెడితే తాము ప్రతిస్పందిస్తున్నామని చెప్పారు.
ఇవి కూాడ చదవండి..