Lalit Modi: లలిత్ మోదీపై సంచలన నిర్ణయం.. కీలక ఆదేశాలు జారీ
ABN , Publish Date - Mar 10 , 2025 | 11:39 AM
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వ్యవస్థాపకుడు లలిత్ మోదీకి గట్టి షాక్ తగిలింది. వనువాటు ప్రధాన మంత్రి లలిత్ పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ (Lalit Modi) ఇటీవల వనువాటు దేశ పౌరసత్వం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా అక్కడి ప్రధాన మంత్రి జోతం నపట్ లలిత్ మోదీ పౌరసత్వాన్ని రద్దు చేయాలని అక్కడి పౌరసత్వ కమిషన్‌ను ఆదేశించారు. అందుకు సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ మొత్తం విషయంలో భారత ప్రభుత్వం కూడా కీలక పాత్ర పోషించింది. న్యూజిలాండ్‌లోని భారత హైకమిషనర్ నీతా భూషణ్, ఇతర ద్వీప దేశాలతో కలిసి ఈ అంశాన్ని లేవనెత్తారు. భారతదేశం చాలా కాలంగా లలిత్ మోదీని తిరిగి భారత్ తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో వనువాటు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భారతదేశానికి ఉపశమనం కలిగించే విషయమని చెప్పవచ్చు.
లలిత్ మోదీపై అవినీతి కేసులు
లలిత్ మోదీపై గతంలో అనేక అవినీతి, ఆర్థిక మోసాలు, మనీలాండరింగ్ కేసుల్లో ఆరపణలున్నాయి. వీటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు ప్రారంభించినప్పటి నుంచి, లలిత్ దేశం విడిచి విదేశాలకు పరారయ్యాడు. మొదట లండన్‌లో పౌరసత్వం పొందిన ఆయన, భారతీయ అధికారుల దర్యాప్తు నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. గత 15 ఏళ్లుగా కూడా లలిత్ లండన్‌లోనే ఉన్నాడు. దీంతో అతన్ని ఇండియాకు రప్పించేందుకు భారత్ అనేక రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల ఆయన వనువాటు దేశ గోల్డెన్ పౌరసత్వం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
కష్టాలు మొదలు..
వనువాటు ప్రభుత్వం లలిత్ మోదీ పాస్‌పోర్ట్‌ను రద్దు చేయడంతో అతనికి అనేక కష్టాలు మొదలు కావచ్చు. పౌరసత్వం కోల్పోవడం వలన, అతను ఇప్పుడు వేరే దేశాల్లో నివాసం పొందడం కష్టతరంగా మారుతుంది. గతంలో విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి వ్యాపారవేత్తలపై కూడా భారత్ ఇదే విధమైన కఠిన చర్యలు తీసుకుంది. ఇప్పుడు లలిత్ మోదీపై కూడా చర్యలు తీసుకుంటూ, ఇండియాకు అతన్ని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తోంది.
15 ఏళ్లుగా పరారీలో..
వనువాటు ఈ చర్య ద్వారా భారతదేశంతో సంబంధాలను కృషి చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఈ నిర్ణయం భారతదేశం పట్ల విదేశీ మద్దతును మరింత పెంచిందని చెప్పవచ్చు. తదుపరి విచారణలలో లలిత్ మోదీపై కోర్టు చర్యలు ఏ విధంగా ఉంటాయనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికీ లలిత్ మోదీ మీద ఉన్న కేసుల కారణంగా ఆయన ఎప్పుడు ఇండియా వస్తారు, ఎలాంటి చర్యలను ఎదుర్కొంటారని అనేకమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లలిత్ 2010లో భారతదేశం విడిచి వెళ్ళాడు.
ఇవి కూడా చదవండి:
Accident: ఎస్‌యూవీ ట్రక్కు ఢీ.. ఏడుగురు మృతి, 14 మందికి గాయాలు
BSNL Offers: రూ. 200 బడ్జెట్‌లోపు బెస్ట్ రీఛార్జ్ పాన్లు.. ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయంటే..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News