Share News

Hostage Situation: నా సమాధిని తవ్వుకుంటున్నా

ABN , Publish Date - Aug 04 , 2025 | 04:20 AM

నా సమాధిని నేనే తవ్వుకుంటున్నాను. రోజురోజుకూ బలహీనపడుతున్నాను. నా వాళ్లను తిరిగి కలిసే పరిస్థితులు

Hostage Situation: నా సమాధిని తవ్వుకుంటున్నా

హమాస్‌ బంకర్‌లో ఇజ్రాయెల్‌ పౌరుడి ఆవేదన

టెల్‌అవీవ్‌, ఆగస్టు 3: ‘‘నా సమాధిని నేనే తవ్వుకుంటున్నాను. రోజురోజుకూ బలహీనపడుతున్నాను. నా వాళ్లను తిరిగి కలిసే పరిస్థితులు కనిపించడం లేదు’’ అంటూ తమ చెరలో ఉన్న 24 ఏళ్ల వయసున్న ఇజ్రాయెలీ యువకుడు ఎవ్యటార్‌ డేవిడ్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియోను హమాస్‌ విడుదల చేసింది. హమాస్‌ బంకర్‌లో ఉన్న డేవిడ్‌ శరీరం బాగా బలహీనంగా మారినట్లు ఆ వీడియో స్పష్టం చేస్తోం ది. గడిచిన 48 గంటల్లో బందీలకు సంబంధించి ఇది రెండో వీడియో. ఇంతకు ముందు రోమ్‌ బ్రస్లవ్‌స్కీ అనే 21 ఏళ్ల జర్మన్‌-ఇజ్రాయెలీ వీడియో విడుదలైంది. అతను కూడా చాలా బలహీనంగా కనిపించాడు. ఈ వీడియోల్లో ‘‘కాల్పుల విరమణతోనే బందీల విడుదల’’ అంటూ హమాస్‌ సందేశాన్ని పంపింది.


చివరి సి-295 భారత్‌కు చేరింది.. అప్పగింతలు పూర్తి చేసిన స్పెయిన్

తేజస్వి యాదవ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 04 , 2025 | 04:20 AM